వర్మ ‘శ్రీదేవి’ టెమ్ట్ చేస్తోంది(హాట్ ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా అదో వివాదం అవుతుంది...లేదా చేస్తారు..లేదా ఆయనే చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ఏదో విధంగా తను తీసే లో బడ్జెట్ చిత్రాలకు ప్రమోషన్ తెచ్చుకోవటం ఆయన లక్ష్యం. అందుకోసం ఆయన అనుసరించే వ్యూహం...వివాదం.

తాజాగా ఆయన ‘శ్రీదేవి' అనే చిత్రాన్ని ప్లాన్‌ చేసిన సంగతీ, ఇటీవల దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు వివాదాస్పదమైన సంగతీ తెలిసిందే. ఈ పోస్టర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టేట్‌ కమీషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ ఆయనకు నోటీసును సైతం పంపింది. ఈ నేపథ్యంలో ‘శ్రీదేవి'గా టైటిల్‌ రోల్‌ చేస్తున్న తార ఎవరో ప్రకటించారు వర్మ. ఆమె పేరు అనుస్మృతి.

ఇంతకీ ఆయన ఈమెను ఎలా చూపబోతున్నారు. సినిమా ద్వారానూ ఏమన్నా వివాదం చేయబోతున్నారా..నిజంగా కథలో అలాంటి కాంట్రవర్శి చేసే ఎలిమెంట్ ఉందా లేక ఆయన కావాలని అలా చేసి పబ్లిసిటీ చేసుకుంటన్నారా..అన్నీ సందేహాలే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషించే ...

అనుస్మృతి ఫోటోలు స్లైడ్ షో లో మీ కోసం...

అది వేరే..

అది వేరే..

ఈ సినిమాలో అనుస్మృతి పోషిస్తున్నది టీచర్‌ పాత్ర కాదు. సినీ తార పాత్ర కూడా కాదు. ఆమె ఓ మధ్యతరగతి గృహిణి పాత్ర పోషిస్తోంది'' అని ఆయన తెలిపారు.

ప్రధానాంశం

ప్రధానాంశం

ఒక అబ్బాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఆధునిక జీవనశైలి వల్ల ఏవిధంగా ప్రభావితమయ్యాడు? దానివల్ల, ఆ అబ్బాయితో పాటు అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి దుష్ఫరిణామాలకు లోనయ్యారనేది ఈ చిత్రంలోని ప్రధానాంశమని ఆయన చెప్పారు.

టీవీల్లో ఇంటర్వూలు

టీవీల్లో ఇంటర్వూలు

ఇది తెలుసుకోకుండా కొంతమంది బాధ్యతా రాహిత్యంతో, సినిమాలో లేని విషయాలను ఉన్నట్లుగా తమకు తాముగా ఊహించేసుకొని టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అని వర్మ విమర్శించారు.

అనుమతితోనే..

అనుమతితోనే..


పోస్టర్‌లో కనిపిస్తున్న అబ్బాయి నటుడు. ఇంతకుముందు కూడా అతను సినిమాల్లో నటించాడు. నా సినిమాలోనూ అతను తన తల్లిదండ్రుల అనుమతితో, వాళ్ల సమక్షంలోనే నటిస్తున్నాడు.

చీప్ పబ్లిసిటీ కోసం..

చీప్ పబ్లిసిటీ కోసం..

సినిమా ఏమిటో, దాని కథేమిటో తెలుసుకోకుండా, ఎంతో డబ్బుతో, మరింకెంతో శ్రమతో మేము తీసే సినిమాకు ‘చీప్‌ పబ్లిసిటీ' కోసం మాకు నెగటివ్‌ పబ్లిసిటీ ఇచ్చినవాళ్లందరిపై కేసులు పెట్టబోతున్నాను అని తెలిపారు వర్మ.

తొలి యవ్వన అనుభూతులు

తొలి యవ్వన అనుభూతులు

ఈ సినిమా కాన్సెప్ట్ టీనేజ్ లోని తమకు ఎదురైన తొలి యవ్వన అనుభూతుల ఆధారంగా తెరకెక్కించనున్నామని చెప్పారు.

టైటిల్ సమస్య

టైటిల్ సమస్య

ఈ చిత్రానికి టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటినుంచీ వివాదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఫస్ట్ లుక్ విడుదల చేసిన రెండవరోజే వర్మకి టైటిల్ సమస్య వచ్చి పడింది. దాంతో ఆయన ఈ టైటిల్ ని ‘శ్రీదేవి' గా మార్చాడు.

ఆమె చేసారనే...

ఆమె చేసారనే...

పవన్ కళ్యాణ్ తో పంజా నిర్మించిన నిర్మాత అయిన నీలిమ తిరుమలశెట్టి ఇదే టైటిల్ ని తన సినిమాకి రిజిష్టర్ చేసానని తెలియచేయటంతో టైటిల్ ని మార్చారని తెలుస్తోంది. కూడా టైటిల్ మార్పుకు మరో కారణం.

మీ అనుభవాలు పంపండి

మీ అనుభవాలు పంపండి

ఈ శ్రీదేవి సినిమా కథా సహకారం కోసం వర్మ ప్రేక్షకులను తమ టీనేజ్ లో జరిగిన అనుభవాల గురించి వర్మ టీంకి పంపితే వాటిలో కొన్నిటిని సినిమాలో పెట్టుకుంటామని కూడా తెలియజేశాడు.

అదే ప్రేరణ...

అదే ప్రేరణ...

సినిమా గురించి వర్మ చెబుతూ....నాకు సరస్వతి టీచర్ ఉన్నట్లే మీమీ జీవితాతల్లో..మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్సో, మీ ట్యూషన్ టీచర్లో...ఇలా రకరకాల ‘శ్రీదేవి'లు ఉండే ఉంటారు. అలాగే మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి ఇన్స్ పిరేషన్ తోనే ఈ ‘శ్రీదేవి' సినిమా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు.

ఆల్రెడీ వచ్చాయి...

ఆల్రెడీ వచ్చాయి...

ఒక టీనేజ్ కుర్రాడు తన కన్నా పెద్దదైన అమ్మాయిపై అట్రాక్షన్ పెంచుకోవడం అనే అంశంతో రూపొందిన ‘మలీనా, సినిమా పరడిసో, సమ్మర్ ఆఫ్ 42, రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్, తూర్పు పడమర' వంటి అనేక చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాయి.

ఆవిడికే సమస్యా లేదు...

ఆవిడికే సమస్యా లేదు...

నేను ప్రస్తావించిన ‘సరస్వతీ టీచర్' అంశం ఎక్కువగా కోపం తెప్పించిందని తెలిసింది. నేను మల్లీ చెబుతున్నా..చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈ మధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే...‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలుగడం చాలా సహజం' అనే ఇంగిత జ్ఞానం ఆవిడకు ఉంది కాబట్టి! ఆవిడకే ఏ సమస్య లేనప్పుడు, వేరే ఏమీ తెలియనివాళ్లకు ఏం సమస్యో...నాకు సమస్య అయ్యి కూర్చుంది.

ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు?

ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు?

ఇక నా సినిమా పోస్టర్ చూసి, కథేమిటో వాళ్లే ఊహించేసుకుని...పోస్టర్ లో ఉన్న అమ్మాయి ‘టీచర్' అని ఫిక్సయిపోతే...అంతకన్నా వెర్రితనం లేదు. ప్రెస్ నోట్ లో అంత క్లియర్ గా నేను రాసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేనంత నిరక్షరాస్యత వాళ్లలో ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం సినిమా తీసాక, అందులో అభ్యంతరమైన సన్నివేశాలుంటే...ఆ వ్యవహారం చూడ్డానికి సెన్సార్ బోర్డ్ ఉంది. సెన్సార్ బోర్డ్ ను అధిగమించి...వీళ్లే నిర్ణయాలు తీసుకొంటామంటే..ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X