For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరకి క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

By Srikanya
|

హైదరాబాద్ :'దుల్కర్‌ని చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి' అని రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే..వెంటనే ''నేను పది జన్మలెత్తి ఎంత సాధించినా మా నాన్న స్థాయికి చేరుకోలేను'' అంటూ 'ఓకే బంగారం' హీరో దుల్కర్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. వెంటనే తేరుకున్న వర్మ...ముమ్మట్టికి, అతని అభిమానులకు క్షమాపణలు అని, తన ట్వీట్స్ ని సరిగ్గా అర్దం చేసుకోలేదని చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేస్తూ...... నేను ఏం ఫీల్ అవుతానో అదో మాట్లాడుతాను అని అందరికీ తెలుసు. ఇదేమీ తొలిసారి కాదు. నేను నా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసాను...

అలాగే...నా ట్వీట్ల అర్దం... గొప్ప తండ్రికు...అద్బుతమైన కొడుకు అని... ఎవరికైతే నా ఈ అభినందనలు సరిగ్గా అర్దం కావో..వారికి నా క్షమాపణలు...దయిచేసి మీ తండ్రికి కూడా వివరించి చెప్పు...ఆయన కూడా అఫెండ్ అయితే... ఆయనకూ నా క్షమాపణలు...

 RGV responds to ok Bagaram Hero

"కానీ ఇప్పటికీ...నువ్వే మీ తండ్రి కన్నా చాలా చాలా గొప్పవాడివని అనుకుంటున్నాను..ఇది నేను నిజాయితీతో చెప్తున్న మాట..ప్రజాస్వామ్యంలో ఉన్న భారత పౌరడుగా నా అభిప్రాయం ఇలా వెల్లబుచ్చాను " అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడే దుల్కర్‌ సల్మాన్‌. మలయాళంలో విజయం సాధించిన 'బెంగళూర్‌ డేస్‌'తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. 'ఓకే బంగారం'లో ఆది పాత్రలో ప్రేక్షకుల్ని అలరించాడు.

దుల్కర్‌ మాట్లాడుతూ.. ''మణిరత్నంసార్‌ ఈ చిత్రాన్ని అందంగా మలిచారు. ఆయన సెట్లో అందరి సలహాలు తీసుకోవడం, మా అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నటీనటులకు కావల్సినంత స్వేచ్ఛనిస్తారు. ఆయన సినిమాలే కాదు, సన్నివేశాన్ని వివరించే విధానమూ కొత్తగా ఉంటుంది. నిత్య మేనన్‌ చాలా ప్రొఫెషనల్‌. సందర్భం, సన్నివేశం చెబితే చాలు పాత్రలో ఇమిడిపోతుంది. ఈ సినిమాలోని సహజీవనం కాన్సెప్ట్‌పై ఒకొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఈ విషయంపై ఇంతకంటే నేనేమీ స్పందించలేను'' అన్నాడు.

''తెలుగు సినిమాలు చూస్తుంటా. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబుల నటన నచ్చుతుంది. తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది'' అన్నాడు దుల్కర్‌. అలాగే...''మణిరత్నం చిత్రంలో పనిచేయడం ఓ అందమైన అనుభవం. ఆ అదృష్టం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు..''అంటున్నాడు దుల్కర్‌ సల్మాన్‌.

English summary
RGV now responding to his tweets came with the following posts. “dulQuer Hey I am known to speak out what I feel in a certain way of expressing my happiness and this is not the first time I did this (sic).“ “dulQuer My tweets meant an extraordinary son of a great father nd if some morons dont understand back handed compli ments I apologize 2 them...I request u to Pls explain this to ur dad and if he too is offended I apologize to him too(sic)“ “But I still think u are far superior 2 ur father in my honest view as a democratic free citizen of india expressing my opinion.(sic)“
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more