twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ శ్రీదేవి లీగల్ నోటీసులపై వర్మ ఇలా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ తన తాజా సినిమాకు ‘శ్రీదేవి' పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరోయిన్ శ్రీదేవి లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై వర్మ స్పందించారు. తాను తీస్తున్న ‘శ్రీదేవి' సినిమాకు, నటి శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అనవసర రాద్దాంతం అవసరం లేదన్నారు.

    15 ఏళ్ల టీనేజీ కుర్రాడు 25 ఏళ్ల మహిళపై ఎలా వ్యామోహం పెంచుకున్నాడనేదే సినిమా కథాంశం, హీరోయిన్ శ్రీదేవి జీవితానికి, తాను తీస్తున్న ‘శ్రీదేవి' సినిమా కథకు అసలు పోలికే ఉండదని వర్మ స్పష్టం చేసారు. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

    RGV response to the legal notice

    చాలా ఏళ్లుగా తాను మీడియా ముందు శ్రీదేవి గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నాకు శ్రీదేవి అంటే ఇష్టమని ఎన్నో సార్లు చెప్పాను. నా మాటల్ని అపుడు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. నేను కేవలం ‘శ్రీదేవి' పేరుతో సినిమా చేస్తే పలువురు వివాదలు రేపుతున్నారని వర్మ తెప్పుకొచ్చారు.

    శ్రీదేవి పంపిన లీగల్ నోటీసుల ఇలా...
    ఇండియన్ సినిమా పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు ఉన్న తన క్లయింట్ (శ్రీదేవి) పేరును వాడుకోవడం ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని, మీ సినిమా(శ్రీదేవి) వల్గర్‌గా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆందోళన చెలరేగిన నేపథ్యంలో ‘శ్రీదేవి' టైటిల్ తొలగించాలని కోరుతున్నాం, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీదేవి లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు.

    English summary
    "My response to the legal notice sent to me by Sridevi with regard to my film "Sridevi"In the legal notice sent to me, there seems to be an apprehension that the film "Sridevi" is based on a crush I personally had for Sridevi in my college years ..I,many times over the last 5 years expressed this publicly in both the media and also to her which was taken by all concerned in a humorous and healthy spirit" Ram gopal varma said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X