ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆమె మాయలో ఎలా .. చేతబడి, మందులు ఇంకా చాలా విన్నా.. ఆర్జీవీ!

చాలా మంది తెలుగు వారు ఆరాధ్య దైవంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుని భావిస్తారు. ఆయన జీవితంపై బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా ఆర్జీవీ కూడా ఆయన జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశం గురించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పార్వతిలాంటి సాధారణ మహిళా ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించింది అనే అంశంతో తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు రాంగోపాల్ వర్మ తెలిపాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో వర్మ ఇంకా మరిన్ని విషయాలు బయట పెట్టాడు.

ఆమె మాయలో ఎలా

ఆమె మాయలో ఎలా

వర్మ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే సాధారణమైన వ్యక్తి కాదు. పొలిటికల్ సిస్టమ్ నే మార్చేసి దేశ రాజకీయాలనే శాసించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి లక్ష్మి పార్వతి మాయలో ఎలా పడతారు. లక్ష్మి పార్వతి గురించి అని విషయాలు నెగిటివ్ గానే విన్నానని వర్మ తెలిపాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన చివరి రోజుల్లో కూడా లక్ష్మి పార్వతి గురించి చాలా మర్యాదగా మాట్లాడారు. లక్ష్మి పార్వతి గురించి బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం అయి ఉండాలి లేదా ఎన్టీఆర్ మానసిక స్థితి సరిగా లేకపోయి ఉండాలి ని వర్మ వ్యాఖ్యానించాడు.

 పిల్లలు పుట్టించడం కోసం

పిల్లలు పుట్టించడం కోసం

పిల్లలు పుట్టించడం కోసం లక్ష్మి పార్వతి మందులు ఉపయోగించింది, అందువలనే ఎన్టీఆర్ అనారోగ్యానికి గురయ్యారు అనే ప్రచారంపై వర్మ స్పందించాడు. కేవలం ఇది మాత్రమే కాదు చేతబడి చేయించింది, మందు పెట్టేసింది అని కూడా విన్నా అని వర్మ అన్నారు. ఈ విషయాలన్నింటిలో తన ఇన్వెస్టిగేషన్ తాను చేశానని, నా దగ్గర ఉన్న సమాచారాన్ని అనలైజ్ చేసుకున్న తరువాత ఓ నిర్దారణకు వచ్చానని వర్మ తెలిపారు. నేను చూపించబోయే విషయాలతో అందరూ ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు అని వర్మ తెలిపాడు.

అందగత్తె కూడా కాదు

అందగత్తె కూడా కాదు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరక్కించడానికి నేను చాలా విషయాలు లక్ష్మి పార్వతి నుంచి తెలుసుకోవాలి. ఆమె చెబుతున్నది నిజమా కదా అని కూడా చెక్ చేసుకుంటున్నానని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ రాజకీయంగా చాలా శక్తివంతమైన నాయకుడు, ధనవంతుడు, ఒక సూపర్ స్టార్. కానీ లక్ష్మి పార్వతి మాత్రం సాధారణ మహిళ. పెద్దగా అందగత్తె కూడా కాదు అని వర్మ తెలిపారు. అలాంటి వీరిద్దరూ ఎలా దగ్గరయ్యారు అనే పాయింట్ ఈ చిత్రంలో చాలా కీలకం అని వర్మ అన్నారు.

ఎలా ప్రవేశించగలిగింది

ఎలా ప్రవేశించగలిగింది

ఎన్టీఆర్ కు పెద్ద కుటుంబం ఉంది. అయినా కూడా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎలా ప్రవేశించగలిగింది. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులచే నిర్లక్ష్యం చేయబడ్డారా అనే కోణంలో కూడా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉంటాయని వర్మ అన్నారు. లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య జరిగిన సంఘటనలు.. ఆ తర్వాత దారితీసిన పరిస్థితుల గురించే ఈ చిత్రం ఉంటుందని వర్మ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X