twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ ఆఫీసర్ నాగార్జున కాదు.. కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్, ఆర్జీవీ కొత్త ట్విస్ట్!

    |

    Recommended Video

    RGV Tweets About Officer Movie

    వివాదాలు లేకుండా రాంగోపాల్ వర్మని ఊహించుకోలేం. కేవలం సినిమాల విషయంలోనే కాదు తనకు అనవసరమైన విషయాల్ని కెలికి మరీ ఈ దర్శకుడు వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. వర్మ సినిమా ప్రారంభించాడంటే ఖచ్చితంగా వివాదం అవుతుంది. దాదాపు పాతికేళ్ల తరువాత నాగార్జునతో వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కథ విషయంలో అనేక ఉహాగానాలు కొనసాగుతున్నాయి. తాజగా రాంగోపాల్ వర్మ ఆఫీసర్ కథ గురించి చేసిన ట్వీట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

     ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా

    ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా

    ఆఫీసర్ చిత్రం ఫ్రెంచ్ లో మంచి విజయం సాధించిన టేకెన్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాఫియా చేతుల్లో చిక్కుకుపోయిన తన కుమార్తెని హీరో ఆ చిత్రంలో రక్షించుకుంటాడు.

    ఊహాగానాలకు తెరదించేలా

    ఊహాగానాలకు తెరదించేలా ఈ చిత్రం కథ గురించి వర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ఆఫీసర్ చిత్ర కథ కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ కథ అని వివరించాడు. 2010 లోనే అతడి గురించి తెలుసుకున్న తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించాడు.

    అసలు ఆఫీసర్ అతడే

    కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కెఎమ్ ప్రసన్న చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. కెఎమ్ ప్రసన్న సిట్ కు చీఫ్ గా పనిచేశారని, ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఆయన అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారని వర్మ తెలిపారు.

    పాతికేళ్ల తరువాత

    పాతికేళ్ల తరువాత

    వర్మ, నాగార్జున కాంబినేషన్లో గతంలో శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చింది. పాతికేళ్ల తరువాత నాగార్జునతో వర్మ ఆఫీసర్ చిత్రాన్ని రూపొందించారు.

    విడుదల వాయిదా

    విడుదల వాయిదా

    ఆఫీసర్ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ అనూహ్యంగా ఈ చిత్రం వాయిదా పడింది. బాంబే కోర్టులో కేసు వలన ఈ చిత్రం కొద్దీ గా ఆలస్యంగా జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    RGV reveals Officer movie story. It is inspired form Karnataka IPS officer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X