Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యాంకర్ శ్యామలను సిగ్గుపడేలా చేసిన RGV.. నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావ్ అంటూ..
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ మాటలతో విజిల్స్ వేయిస్తాడు. ఇక నిత్యం ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు రాంగోపాల్ వర్మ ఏదో ఒక కామెంట్ తో వాళ్లని పొగడకుండా ఉండలేడు. అయితే మొదటి సారి యాంకర్ శ్యామలను చూసిన RGV స్టేజ్ పైనే ఎవరూ ఊహించని విధంగా ఒక కామెంట్ చేశాడు. దీంతో శ్యామల సిగ్గు పడిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..
గ్లామరస్ యాంకర్స్ తో..
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించిన విషయాలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా గ్లామరస్ యాంకర్స్ తో వర్మ చేసే ఇంటర్వ్యూలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా వర్మ గర్ల్స్ తో చాలా విభిన్నంగా మాట్లాడుతూ ఉంటారు. వారిని పొగుడుతూ ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటారు.
అషు రెడ్డితో బోల్డ్ గా
ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ అరియనా తో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన రాంగోపాల్ వర్మ అందరికీ షాకిచ్చాడు. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే వర్మ ఏమిటో చాలా క్లారిటీ గా అర్థమైపోయింది. ఆ తర్వాత మరికొంత మంది తో కూడా వర్మ డిఫరెంట్ గా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశాడు. గ్లామరస్ బ్యూటీ అషు రెడ్డి తో కూడా బోల్డ్ గా మరొక వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
యాంకర్ శ్యామలను చూసి..
ఇక రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అక్కడ మొదటి సారి తెలుగు యాంకర్ శ్యామల ను చూసి కొంత ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా స్టేజ్ పైన యాంకర్ శ్యామల పై ఎవరూ ఊహించని విధంగా స్పందించి ఆమెను సిగ్గుపడిపోయి నవ్వుకునేలా చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నా కళ్ళలో నుంచి ఎలా తప్పించుకున్నారు?
ఇటీవల బడవ రాస్కెల్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినా రామ్ గోపాల్ వర్మ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక స్టేజి పైకి రాగానే ఆయన ముందుగా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంత అందంగా ఉన్న మీరు ఇప్పటివరకు నా కళ్ళలో నుంచి ఎలా తప్పించుకున్నారు? అంటూ ఎదురుగానే స్టేజ్ పైనే శ్యామల తో చెప్పేశాడు. దీంతో యాంకర్ శ్యామల ఒక్కసారిగా నోరు తెరిచి సిగ్గు పడి పోయి నవ్వుకుంది. వర్మ అలా కామెంట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా విజిల్స్ వేశారు.
బడవ రాస్కెల్..
ఇక బడవ రాస్కెల్ సినిమా గురించి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు తనను అందరూ రౌడీ తోపు గుండా అనే చాలా రకాలుగా అన్నారు అంటూ.. అయితే నేను రాస్కెల్ ని అని కూడా వర్మ తనని తానే తిట్టుకున్నాడు. ఇక బడవ రాస్కెల్ ఆ అంటూ యాంకర్ శ్యామల అడగడంతో బడవ అంటే తనకు మీనింగ్ తెలియదు అని వర్మ చాలా సున్నితంగా సమాధానమిచ్చాడు.. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.