పాత్ బ్రేకింగ్: మంచు విష్ణు, వేలంపాట అదుర్స్

By Pratap

హైదరాబాద్: భ్రుకుటి ముడిచినవారు ఇప్పుడు అనుక్షణం వేలంపాటకు లభిస్తున్న ఆదరణను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాని వేలం వేయబోతున్నారా అంటూ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఓ ప్రశ్న దుమారం రేపుతూ వచ్చింది. ఇది సీరియస్ వ్యవహారం కాదని అనుకున్నారు.

రామో గోపాల్ వర్మ తన కొత్త సినిమా అనుక్షణం కోసం చేస్తున్న మరో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు అందరూ. అలా అనుకున్నవారి అంచనాలు తలకిందులు చేస్తూ అనుక్షణం వేలం పాట ప్రారంభమైన మూడు రోజుల్లోనే 410 థియేటర్లు బుక్కై అనుక్షణం వేలం పాట టౌక్ ఆఫ్ ద టౌన్‌గా మారినట్లు చెబుతున్నారు.

RGV's Anukshanam auction recieves good respnse

ఆ రకంగా అది మరో అధ్యాయానికి తెలుగు సినీ ప్రపంచంలో నాంది పలికిందని అంటున్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న అనుక్షణం చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకుడు. వేలంపాటకు అనూహ్యమైన ఆదరణ లభిస్తుండడంపై హీరో మంచు విష్ణు స్పందించారు.

అనుక్షణం చిత్రం పాటకు లభిస్తున్న ఆదదరణ తమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని, విడుదలకు ముందే తమ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఎప్పుడు పాత్ బ్రేకింగ్‌గా ఉంటాయని ప్రశంసించారు. ఈ వేలం పాట పద్ధతి కూడా తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X