వర్మ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఇచ్చేసారు

By Srikanya

 RGV's Anukshanam’s release date confirme
హైదరాబాద్ : 'అనుక్షణం...అమ్మాయిలూ జాగ్రత్త' అనే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 12 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేసారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల ప్రసంశలు పొందిందని చెప్తున్నారు.

ఇక ఈ సినిమాని మొదట ఆగస్టు 15 న విడుదల చేయానికి నిర్ణయించి ప్రకటన చేసారు. అయితే మొట్ట మొదటి సారిగా వేలం పాట(ఆక్షన్) ద్వారా రిలీజ్ చేయనుండటంతో డిస్ట్రిబ్యూటర్స్ గురించి మరింత క్లారిటీ కోసం ఈ చిత్ర టీం సినిమా విడుదలని వాయిదా వేశామని చెప్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ 'టెన్షన్ టెన్షన్' లేదా '12′ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజుతో ఆ వార్తలకి తెరపడింది. ఫైనల్ గా వర్మ సినిమాకి 'అనుక్షణం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. 'అమ్మాయిలూ జాగ్రత్త' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 'రౌడీ' సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X