సంక్రాంతి పోటీలోంచి తప్పుకున్న అప్పలరాజు చిత్రం
రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రం మొదట ప్రకటించినట్లుగా సంక్రాంతికి విడుదలకావటం లేదు. ఈ విషయాన్ని నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ మీడియాకు తెలియచేసారు. సంక్రాంతి అనంతరమే ఈ చిత్రం విడుదల చేయునున్నట్లు చెప్పారు. దీనికి కారణం వివరిస్తూ...తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని విధంగా చోటు చేసుకున్న స్ట్రైకుతో షూటింగ్ ఆగిపోయిందని, ముందునుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే రిలీజ్ కు ఇబ్బంది ఉండేది కాదని టైమ్ దగ్గర పడటంతో ఈ వాయిదా వేయాల్సి వస్తోందని అన్నారు. అలాగే చిత్రం షూటింగ్ వచ్చే నెలలో షెడ్యూల్ ప్లాన్ చేసి కంప్లీట్ చేస్తామని అన్నారు. ఇక ఇప్పటికే అప్పలరాజు పాటలు మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాగే ఈ చిత్రం విడుదల చేసిన బ్రోచర్ కూడా అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశంగా మారింది. దాంతో పండుక్కి విడుదల అవుతున్న ప్రధాన చిత్రాలు మిరపకాయ, పరమవీర చక్ర, అనగనగా ఒక ధీరుడు పోటీలో ఉన్నాయి.
సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో రెడీ అవుతన్న ఈ చిత్రంలో సునీల్..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా తీయటం కథాంశం. సినిమా తీయటం వ్యవసాయం చేసినంత ఈజీ అనకునే అతను ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు..విజయం ఎట్లా సాధిస్తాడనేది కథ అని చెప్తున్నారు. వర్మ..కాంటాక్ట్ చిత్రంతో పరిచయమైన సాక్షి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే కలర్స్ స్వాతీ ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడుతూ నవ్వులు పండించనుంది. సంక్రాంతి రోజు విడుదల అయ్యే ఈ చిత్రం కోసం వర్మ ఓ పాటను సైతం రాసారు. కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్, కృష్ణుడు, వేణుమాధవ్, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్ వర్మ.


Click it and Unblock the Notifications











