శివరాత్రి శుభాకాంక్షలు రాంగోపాల్ వర్మ ఇలా...
'ది ఎటాక్స్ ఆఫ్ 26/11' సినిమా తర్వాత 'సత్య 2'ను తీస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. 1998లో జె.డి. చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ బాజ్‌పేయి, షెఫాలీ షా ప్రధాన తారలుగా ఆయన రూపొందించిన 'సత్య' చిత్రాన్ని ఇది సీక్వెల్. మామ్మూత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ బేనర్‌పై నిర్మాణమయ్యే 'సత్య 2' యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నది. ఒరిజినల్‌లో నటించిన వారు కాకుండా ఇందులో కొత్తవాళ్లు నటించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తయారవుతున్న
ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో కథానాయకుడి పాత్రను శర్వానంద్ పోషిస్తున్నారు. ఆదివారం హిందీ వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వర్మ అందులో హీరో పేరును మాత్రం వెల్లడించలేదు. ముంబైలో కనిపించకుండా పోయిన అండర్‌వరల్డ్‌ని 2013లో తిరిగి నెలకొల్పేందుకు యత్నించే ఓ యువకుడి కథ ఈ సినిమా. రాధికా ఆనంద్ ఈ సినిమాకి కథని సమకూరుస్తున్నారు.
నిజ జీవిత మాఫియా డాన్‌లైన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్, అబూ సలీమ్, అరుణ్ గావ్లి వంటి వాళ్లు చేసిన తప్పులు ఈ కథకి ప్రేరణ అని తెలుస్తోంది. నేటి పోలీసు పద్ధతులు ఎలా ఉన్నాయో, అండర్‌వరల్డ్ డాన్‌లు ఎలాంటి కొత్త పద్ధతుల్లో డబ్బులు సంపాదిస్తున్నారో కూడా ఇందులో వర్మ చూపిస్తున్నారు. విక్రమ్ బిశ్వాస్ సంగీత దర్శకుడిగా, వికాస్ షరఫ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అమర్ మొహిలే నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications












