Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ గోపాల్ వర్మ కుమార్తె వివాహ తేదీ
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుమార్తె రేవతివర్మ వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 15న హైదరాబాద్ లో ఈ వివాహం జరగనుందని సమాచారం. పెద్దగా ఎవరినీ పిలవకుండా... కేవలం ఆప్తులు,శ్రేయాభిలాషులు సమక్షంలో...ఈ వివాహం జరపనున్నారు.

ఇక వీరి నిశ్చితార్థం జనవరి 2, 2013 ప్రణవ్‌తో జరిగింది. హైదరాబాద్‌లోని రాడిస్సన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో వర్మ పాల్గొన్నారు. కాబోయే దంపతుల్ని ఆశీర్వదించారు.వర్మ కుమార్తె రేవతి వైద్య విద్యను అభ్యసించారు. ప్రణవ్ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. వాళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రణవ్ తల్లి,తండ్రులు దుబాయి లో డాక్టర్లుగా ఉంటున్నారు.
నా జీవితం, నా ఇష్టం అనుకొనే తత్వం రామ్‌గోపాల్ వర్మది. అనుబంధాలకు ఆయన పెద్ద విలువ ఇవ్వరని చిత్రసీమలో చెబుతారు. కుటుంబం గురించీ, కుమార్తె గురించీ ప్రశ్నలు వేసినా ఆయన సూటిగా సమాధానమివ్వరు. అలాంటి వర్మకి త్వరలో మామగారుగా ఈ కొత్త హోదా రాబోవటం చిత్రం అనిపించినా విచిత్రం మాత్రం కాదు అని ఆయన పరిచయస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.