»   » సెక్స్ అవసరమే, ఆడవాళ్లే ఎక్కువ చూస్తున్నారు: గాడ్ సెక్స్ అండ్... గాయిత్రి సపోర్ట్!

సెక్స్ అవసరమే, ఆడవాళ్లే ఎక్కువ చూస్తున్నారు: గాడ్ సెక్స్ అండ్... గాయిత్రి సపోర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అనే షార్ట్ ఫిల్మ్ విషయంలో తెలుగు మీడియాలో కొన్ని రోజులుగా ఎడతెగని చర్చ సాగుతోంది. ఈ సినిమాను పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేయడం, ఆమెను పూర్తి నగ్నంగా ఇందులో చూపించబోతుడటంతో.... వర్మపై విమర్శలు సైతం వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తూ వారని చెడగొడుతున్నాడని పలువురు సంప్రదాయ వాదులు మండి పడుతున్నారు.

ఆమెతో సెక్స్ చేశావా? వర్మ మొహం మీదే అడిగిన కాలేజీ అమ్మాయి !
 వర్మకు సపోర్టుగా గాయిత్రీ గుప్తా

వర్మకు సపోర్టుగా గాయిత్రీ గుప్తా

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' విషయంలో కొందరు వర్మను విమర్శిస్తుంటే..... తెలుగు నటి, ‘ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా మాత్రం సపోర్టుగా నిలుస్తోంది. వర్మ చేస్తున్న ఈ ప్రయత్నం చూసి తాను గర్వ పడుతున్నట్లు గాయిత్రి గుప్తా తెలిపారు.

 ఇండియాలో అలాంటివి చూసే వారు ఉన్నారు

ఇండియాలో అలాంటివి చూసే వారు ఉన్నారు

నా దృష్టిలో పోర్న్ అనేది నాట్ గుడ్. మన ఇండియాలో పోర్న్ అనేది చూడటం వరకు లీగల్, తీయడం ఇల్లీగల్. ఇండియాలో పోర్న్ చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. వాటికి ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టే రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' లాంటివి తీస్తున్నారు.... గాయిత్రి గుప్తా తెలిపారు.

 పోర్న్ చూడటం లీగల్ అంటున్న గాయిత్రి

పోర్న్ చూడటం లీగల్ అంటున్న గాయిత్రి

ఇండియాలో పోర్న్ చూడటం లీగల్ అని గాయిత్రి గుప్తా అన్నారు. ఒక వేళ ఇండియాలో ఇల్లీగల్ అయితే ఇంటర్నెట్లో ఓపెన్ కాకుండా బ్యాన్ చేసి ఉండేవారు. అలాంటిదేమీ లేదు, మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో బ్యాన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరుగలేదు..... అందరూ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది చూడటం లీగలే అని తాను అనుకుంటున్నట్లు గాయిత్రి గుప్తా తెలిపారు.

 సెక్స్ అనేది ప్రతి మనిషికి అవసరమే

సెక్స్ అనేది ప్రతి మనిషికి అవసరమే

సెక్స్ అనేది ప్రతి మనిషికి..... ప్రతి బాడీకి ఒక అవసరం. మనకు ఆకలి తీర్చుకోవడానికి ఫుడ్ ఎలా అవసరమో..... అలాగే శరీరానికి సంబంధించిన ఒక అవసరం తీర్చుకోవడానికి సెక్స్ అనేది కూడా అవసరమే... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

ఆడవారే ఎక్కువ చూస్తున్నారు

ఆడవారే ఎక్కువ చూస్తున్నారు

ఇండియన్ పోర్న్ వ్యూవర్స్ గణాంకాలు చూస్తే మన ఇండియాలో పోర్న్ చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండియాలోనే పోర్న్ చూసే వారి ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 చిన్న పిల్లలు చూస్తే పరిస్థితి ఏమిటి?

చిన్న పిల్లలు చూస్తే పరిస్థితి ఏమిటి?

రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఇలాంటి అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. వాటిని 7వ తరగతి అబ్బాయి యూట్యూబులో చూస్తే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ...... 7వ తరగతి అబ్బాయి చూడకూడదు అన్నపుడు యూట్యూబ్ లాంటి మాధ్యమాలు ఆ వయసు వారికి ఎందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. అది ఆర్జీవి రెస్పాన్సిబిలిటీ కాదు అని సమాధానం ఇచ్చారు.

 రామ్ గోపాల్ వర్మ లాంటి వారి వల్లే

రామ్ గోపాల్ వర్మ లాంటి వారి వల్లే

ఆర్జీవీ లాంటి వారు అలాంటివి తీయడం వల్లే ఇపుడు మనం, మన సమాజం మైనర్ల గురించి ఆలోచిస్తున్నాం. మన దేశంలో నిర్భయ కేసు అయితే తప్ప ఇలాంటి కేసుల విషయంలో ఒక సీరియస్ నెస్ రాలేదు. నా దృష్టిలో ఆర్జీవి ఈ విషయంలో ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు.

 సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం

సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం

సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాలా? వద్దా? అనే ఒక సందేహం ఉన్న మన సమాజంలో ఆర్జీవీ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' మూలంగా మీడియాలో ఓపెన్ డిబేట్స్ జరుగుతున్నాయి. సెక్స్ గురించి కాలేజీ పిల్లలు టీవీ స్టూడియోలకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది మంచి పరిణామమే అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 గర్వ పడుతున్నాను

గర్వ పడుతున్నాను

రామ్ గోపాల్ వర్మ వల్ల సెక్స్ గురించి మనం అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం.... ఆయన వల్ల ఈ అంశంపై ఇంత మార్పు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 వర్మ తప్పు చేయడం లేదు

వర్మ తప్పు చేయడం లేదు

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు. మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. దాన్ని మన దేశంలోని థియేటర్లలో, యూట్యూబ్ లాంటి వాటిలో విడుదల చేయడం లేదు. పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక డిజిటల్ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. నచ్చిన వారు చూస్తారు, నచ్చని వారు చూడరు ఇందులో తప్పు ఉందని తాను భావించడం లేదు అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 సన్నీ లియోన్ ప్రస్తావన తెచ్చిన గాయిత్రి

సన్నీ లియోన్ ప్రస్తావన తెచ్చిన గాయిత్రి

సన్ని లియోన్ ఒక పోర్న్ స్టార్. ఆమె ఇండియాకు సంబంధించిన వ్యక్తి. ఒక పోర్న్ స్టార్. ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ పోర్న్ సినిమాలు చేసి పాపులర్ అయింది. ఇపుడు ఆమెను దేశం మొత్తం ఎందుకు సపోర్టు చేస్తోంది? ఆమెకు ఎందుకు అంత మంది అభిమానులు ఎలా ఉన్నారు? ఆమె దేశం బయట పోర్న్ సినిమాలు చేసినా... ఇండియాకు వచ్చిన తర్వాత ఎథిక్స్ కు కట్టుబడి ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. వర్మ కూడా ఎథిక్స్ కు కట్టుబడి ఉన్నారు అని గాయిత్రి గుప్తా అన్నారు.

English summary
Gayatri Gupta supports RGV's "God, Sex & Truth" movie. She feels that such a movie will initiate a debate on Sex, a topic that needs to be discussed but unfortunately remains under the closet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu