కొత్త టెక్నిక్ : రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ (ఫోటోలు)
హైదరాబాద్: తన కెరీర్లో ఎప్పుడూ తీసే 'రక్త చరిత్రలు, దెయ్యాలు, బూతాలు, అంతాలు, గాయాలు' లాంటి మూస టైటిల్స్ సబ్జెక్ట్ నుండి బయటకు వచ్చి...చాలా రోజు తర్వాత ఒక పాజిటివ్ టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఐస్ క్రీమ్'. భీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
గత 2 నెలలుగా ఏకబిగిన జరిగిన షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నాడు. చాలా మందికి అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. దానికి కారణం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించక పోవడమే. అసలు ఇలాంటి చేయడం వర్మకు ఇష్టం ఉండదట.
మిగతా వివరాలు స్లైడ్ షోలో....

ఐస్ క్రీమ్
సినిమా మొత్తం పూర్తయి..ఒక ట్రైలర్ గానీ, లేదా టీజర్ గానీ చేతికి వచ్చాకే సదరు సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేస్తాడు. ఆ కోవలోనే ‘ఐస్ క్రీమ్' టీజర్ రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. ‘ఐస్ క్రీమ్' టైటిల్ చూస్తేనే ఈ చిత్రం వర్మ గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఫ్లోకామ్
తన మొదటి చిత్రం ‘శివ'తో ‘స్టడీకామ్' అనే పరికరాన్ని పరిశ్రమకు పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ....‘ఐస్ క్రీమ్' చిత్రంతో ‘ఫ్లోకామ్' అనే ఒక సరికొత్త పరికరాన్ని చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ ‘ఫ్లోకామ్' అనే టెక్నికల్ పరికరాన్ని మొత్తం ఆసియాలోనే మొట్ట మొదటి సారిగా ‘ఐస్ క్రీమ్' చిత్రం కోసం ఉపయోగించడం విశేషం.

సరికొత్త అనుభూతి
ఈ ‘ఫ్లోకామ్' పిక్చరైజేషన్ కారణంగా ప్రేక్షకులు ఓ కొత్త తరహా అనుభూతిని పొందుతారని ‘ఐస్ క్రీమ్' మూవీ రషెస్ చూసిన వాళ్లు చెబుతున్నారు.

ముఖ్య పాత్రల్లో...
ఈ చిత్రం నవదీప్-తేజస్వి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏ జేనర్‌కు చెందినది? కథా కమామిషు ఏమిటి వంటివి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











