హారర్ + గ్లామర్... ('ఐస్ క్రీమ్-2' ప్రివ్యూ)
హైదరాబాద్: జీరో బడ్జెట్ లో వరసగా సినిమాలు చేస్తున్న వర్మ మరోసారి తన తాజా చిత్రంతో ముందుకు వస్తున్నారు. సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఐస్ క్రీమ్ పై పెదవి విరిచినా.. ఆ చిత్రం లాభాల్ని అందించిన ఉత్సాహంతో వర్మ సీక్వెల్ కు సిద్దమయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఐస్ క్రీమ్ 2 చిత్రాన్ని రూపొందించి విడుదలకు సిద్దం చేసారు. వర్మ కు అత్యంత ఇష్టమైన హర్రర్ జానర్ లో ఈ చిత్రం తీసినట్లు చెప్తున్నారు.
గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో చిత్రీకరించాం. కానీ ఈ సినిమాను ఔట్‌డోర్‌లో చక్కని లొకేషన్లలో రూపొందించాం. టీమంతా కష్టపడి చేస్తే ఔట్‌డోర్ బాగా వస్తుందనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉత్కంఠగా సాగుతూనే చక్కని వినోదాన్ని పంచుతుంది'' అని తెలిపారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘కొంత భాగాన్ని రీషూట్ చెయ్యడం వల్ల సినిమా రిలీజ్ లేట్ అయింది. 300కు పైగా థియేటర్‌లలో సినిమాను విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.
జె.కె.భారవి మాట్లాడుతూ ‘‘సినిమా రంగంలో కొత్త పొకడల్ని తీసుకొస్తున్న గురువు రాంగోపాల్‌వర్మ. సాంకేతికంగానే కాకుండా డిస్ర్టిబ్యూషన్ రంగంలో కూడా కొత్త పద్దతుల్ని ప్రవేశపెట్టి ‘సినిమా మేడ్ ఈజీ' అని రుజువు చేశారు. ఇటువంటి ప్రయత్నంలో ఎన్నో మాటలు, విమర్శలు వస్తుంటాయి. అవన్నీ రామసేతువులు అవుతాయి. ఐస్‌ఫ్రూట్ సాంగ్ చాలా హాట్‌గా ఉంది'' అని అన్నారు.
ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసామని చెప్తున్నారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేసినట్లు చెప్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్ 2′ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. హారర్ తో పాటు గ్లామర్ కూడా పుష్కలంగా ఉన్న చిత్రమిది. ' అన్నారు.
సంస్ధ : భీమవరం టాకీస్ పతాకం
నటీనటులు :జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రి తదితరులు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్,
నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!
విడుదల తేదీ: 21,నవంబర్ 2014.


Click it and Unblock the Notifications











