ఉన్న ఒక్క పాటకూ...హడావుడి చేసిన వర్మ (ఫోటోలు)
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐస్ క్రీమ్' చిత్రం ఈ నెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో....ఈ చిత్రంలో ఉన్న ఒకే ఒక్క పాటను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. చిత్ర కథనాయకుడు నవదీప్ ఈ పాటను విడుదల చేసారు. ప్రద్యోతన్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాటకు రాణిపూలోమజాదేవి సాహిత్యం అందించారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న బాబి(సంగాప్రతాప్ కుమార్)తో పాటు ప్రద్యోతన్ ఈ పాటకు గాత్రమందించారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, రామసత్యనారాయణ, ప్రద్యోతన్, రాణిపులోమజాదేవి, బాబి, సినిమాటోగ్రాఫర్ అంజిలతో పాటు నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వర్రావు, ప్రభు పాల్గొన్నారు.
ఫ్లోకేమ్ టెక్నాలజీతో రూపొందించిన 'ఐస్ క్రీమ్' తన కెరీర్లో కచ్చితంగా ఓ డిఫరెంట్ ఫిలింగా నిలుస్తుందని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఐస్ క్రమ్ చిత్రాన్ని ఈ నెల 11న టేబుల్ ప్రాఫిట్‌తో విడుదల చేస్తున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో నవదీప్ ఆనందం వ్యక్తం చేసారు. హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చినందుకు రామ్ గోపాల్ వర్మకు తేజస్వి థాంక్స్ చెప్పింది.

ఐస్ క్రీమ్
‘ఫియర్ ఈజ్ హాట్' అనే క్యాప్షన్‌తో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘ఐస్ క్రీమ్'.

తేజస్వి
హీరోయిన్‌గా తొలి సినిమా చేస్తున్న తేజస్వి మొదటి సినిమాలోనే గ్లామర్ పరంగా రెచ్చిపోతోంది. ఈచిత్రంలో ఓ సన్నివేశంలో లో దుస్తులు సైతం లేకుండా నగ్నంగా నటించింది.

న్యూడ్ సీన్ గురించి తేజస్వి
ఈ సినిమాలో నేన చేసిన న్యూడ్ సీన్ ట్రిక్కీగా తీసినది. ఒక రూమ్‌లో నాలుగు కెమెరాలు ఫిక్స్ చేశారు. నేను ఒక్కదాన్నే వెళ్లి స్టార్ కెమెరా, కట్ చెప్పుకుని షాట్ ఓకే చేసుకుని వచ్చాను. అయితే అదంతా ఓ ట్రిక్కుతో జరిగింది. నేను న్యూడ్‌గా నటించానా? లేదా? అనేది సినిమా చూసిన తరువాతే అర్థం అవుతుంది.

నవదీప్-తేజస్వి
నవదీప్-తేజస్వి జంటగా ‘కమింగ్ టు బర్న్ యు' అంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని ‘భీమవరం టాకీస్' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











