ఆర్జీవీ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ దారుణంగా ఉంది... వైఎస్, పరిటాల ప్రస్తావన!

By Bojja Kumar

Recommended Video

ఆర్జీవీ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ !

ఇప్పటికే రాయలసీమ ఫ్యానిజంపై 'రక్తచరిత్ర' లాంటి సినిమా చేసిన వర్మ.... కడప రెడ్ల చరిత్రను తన వెబ్ సిరీస్ ద్వారా పూర్తి స్థాయిలో దాని మూలాల నుండి లోతుగా చూపించబోతున్నారు. కడప రెడ్ల చరిత్రపై తాను తీయాలనుకున్న సినిమాకు వ్యక్తులు, సెన్సార్ నిబంధనలు అడ్డు పడుతుండటంతో వర్మ దాన్ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు వస్తున్నారు. తాజాగా 'కడప' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి, బాంబుల శివారెడ్డి, ఓబుల్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి ప్రస్తావన కూడా ఉండటం గమనార్హం.

 కత్తి పట్టుకుని పెడతారు

కత్తి పట్టుకుని పెడతారు

రాయలసీమ మొగోళ్ళు అమ్మ కడుపులో నుండే కత్తి పట్టుకుని పుడతారు అని.... అక్కడి వారి నమ్మకం అంటూ ‘కడప' వెబ్ సిరీస్ మొదలవుతుంది. ఫ్యాక్షన్ అమ్మ వెలిసింది సీమలో... ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే, గర్భగుడి కడప... ఇది రాయలసీమ రెడ్డ చరిత్ర అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

ఫ్యాక్షనిస్ట్ రాజా రెడ్డి ప్రస్తావన

‘అదే పనిగా పెట్టుకుంటే ఎవడినైనా చంపవచ్చు' అని ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తన వెబ్ సిరీస్ లో వర్మ ప్రస్తావించారు.

 అన్నీ నిజమైన పాత్రలే

అన్నీ నిజమైన పాత్రలే

‘కడప' వెబ్ సిరీస్ లో చూపిస్తున్నఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదని, కానీ ప్రాణభయం వలన వారందరి పేర్లు, వారు నివసించిన కొన్ని ఊర్ల పేరు కూడా మార్చడం జరిగిందని వర్మ తెలిపారు. ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు... నూటికి నూరుపాళ్లు ముమ్మాటికీ నిజమని వర్మ నొక్కి వక్కానించారు.

 రాజశేఖర్ రెడ్డి, బాంబుల శివారెడ్డి ప్రస్తావన

రాజశేఖర్ రెడ్డి, బాంబుల శివారెడ్డి ప్రస్తావన

కన్నుకు కన్ను. సమాధానం కాని సమాధానం అంటూ గతంలో రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయాన్ని... పగలేని బతుకు బుతకే కాదని బాంబుల శివారెడ్డి చెప్పిన మాటలను కూడా ఈ వెబ్ సిరీస్ లో వర్మ ప్రస్తావించారు.

ఫ్యాక్షన్ అనే రాక్షసి

ఫ్యాక్షన్ అనే రాక్షసి

ఒకప్పుడు రాయలసీమలో ప్రజలు సాధారణంగా బ్రతికేవారని, వాళ్లు నవ్వే వాళ్లు, ఏడ్చేవాళ్లు, పెళ్లిళ్లు చేసుకునే వారు పిల్లల్ని కనేవారని, కానీ వాళ్ల అందరి జీవితాల్లోకి ఫ్యాక్షన్ అనే ఒక రూపంలోని రాక్షసి ప్రవేశించి విచ్చుకత్తుల్లాంటి తన కోరల్ని వారి గొంతుల్లోకి బాగా లోతుగా దించి వారి రక్తాన్ని పీల్చి పీల్చి తాగా వారి శరీరాల్ని విసిరి అవతల పారేసిందని వర్మ చెప్పుకొచ్చారు.

ఓబుల్ రెడ్డి, పరిటాల రవి ప్రస్తావన

బలంలేని వాడు కొజ్జాగాడు... అంటూ గతంలో ప్యాక్షనిస్టు ఓబుల్ రెడ్డి చెప్పిన విషయాన్ని.... ఒక్కడిని చంపితే మర్డర్, వందమందిని చంపితే లీడర్ అంటూ పరిటాల రవి వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ ట్రైలర్లో వర్మ ప్రస్తావించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X