రామ్ గోపాల్ వర్మ మళ్ళీ దిగేశాడు.. పోలీసులు, జర్నలిస్టులు ఎవ్వరినీ వదల్లేదు!
విలక్షణం, వింత, వివాదాస్పదం అన్నీ ఒక్కరిలో ఉండే ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమాలు తీయడంలో, మాటలు మాట్లాడటంలో ఆయనకు సాటి రాలేరెవ్వరు అనడంలో అతిశయోక్తి లేదు. మరీ ఈ మధ్యకాలంలో వర్మ తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలుకొని రాజకీయాలపై ఫోకస్ పెడుతూ తన స్టైల్ చూపుతున్నాడు వర్మ.
ఈ నేపథ్యంలోనే తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో డిఫెరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదు అంటూనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు వర్మ. ఎప్పుడూ ఏదో ఒక బాంబ్ వేస్తూ రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నాడు. గత కొంతకాలంగా వస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కాగా తాజా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ గురించి అప్‌డేట్ ఇస్తూ దీన్ని పొలిటిషన్స్, జర్నలిస్ట్స్, పోలీస్, రౌడీస్, ఫాక్షనిస్ట్స్, ప్రజలందరికీ తన యొక్క దీపావళి గిఫ్ట్ అని ప్రకటించాడు వర్మ. ఈ మేరకు అక్టోబర్ 27 వ తేదీ ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లుగా సందేశమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. వర్మ మళ్ళీ దిగుతున్నాడు ఈ సారి దీపావళి బాంబులకు కొదవే ఉండదేమో! అని చెప్పుకుంటున్నారు పబ్లిక్.


Click it and Unblock the Notifications











