‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ స్టైల్ లో వర్మ, ఇంకొదరు సెల్ఫీ

By Srikanya

హైదరాబాద్‌: చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కు హిట్ వచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం కిల్లింగ్‌ వీరప్పన్‌ జనవరి 1న కన్నడలో విడుదలై మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి రివ్యూలే అందుకుంది. ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రలో నటుడు శివరాజ్‌కుమార్‌ నటించగా, వీరప్పన్‌గా సందీప్‌ భరద్వాజ్‌ నటించారు.

అయితే ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌ ఫస్ట్‌లుక్‌ ఫొటోలో కాఫీ కప్పు పట్టుకుని స్టైల్‌గా పోజ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోజ్‌కు సోషల్‌ మీడియాలో చాలా క్రేజ్‌ కనిపిస్తోంది. అభిమానులే కాక సెలబ్రటీలు సైతం దీన్ని అనుకరిస్తూ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

RGV's Killing Veerappan Selfie

బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌, నటి హరిప్రియ, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు ఇలా సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫొటోను పంచుకున్నారు. పూరీ జగన్నాథ్‌ ఫొటోను వర్మ తన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. కాగా ఈ నెల 7న కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రం తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేసి వచ్చే నెల అంటే జనవరి మొదటి తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతూ మరీ తెరకెక్కించారు.

RGV's Killing Veerappan Selfie

కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X