ఎన్టీఆర్ మీద వివాదాస్పద మూవీ: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ ఇదే
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. త్వరలోనే ఈ చిత్రం మొదలు కానుంది. ఎన్టీఆర్ చివరి రోజులను సినిమాలో చూపించనున్నారు.లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా ఉండనుంది.
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కోణంలో ఈ సినిమా ఉండబోతోంది.
ఎన్టీఆర్ ఇంట్లోకి లక్ష్మీ పార్వతి అడుగు పెడుతున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రముఖంగా ఫోకస్ చేయబోతున్నారు.

ఏది వాస్తవం?
లక్ష్మీ పార్వతిని పెళ్లాడిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిపై ఆయన భార్య లక్ష్మి పార్వతి వాదన ఒకలా ఉంటే, లక్ష్మీ పార్వతిని వ్యతిరేకించిన ఆయన కుటుంబం వాదన మరోలా ఉంది. ఇందులో ఏది వాస్తవం అనే విషయంలో ఎవరి వాదన వారిదే.
Recommended Video


వర్మ ఏం చూపించబోతున్నారు
సినిమా టైటిల్ చూస్తుంటే.... వర్మ ఈ చిత్రాన్ని లక్ష్మీ పార్వతి కోణంలోనే చూపిస్తారని స్పష్టం అవుతోంది. అదే సమయంలో వర్మ సినిమాను అలా ఊహించుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఇరు వర్గాల వాదనలు విని ఆయన తనదైన వాదన విపిపించే రకం. గతంలో వచ్చిన రక్తచరిత్ర లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. వర్మ ఈ సినిమా ద్వారా ఏం చూపిస్తారనేది ఆసక్తికరమే.

నిర్మాత ఎవరో?
తాజాగా విడుదలైన పోస్టర్లో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పేరు తప్ప....ఇతర వివరాలు ఏమీ లేవు. ఈ చిత్రానికి నిర్మాత ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. జెడి చక్రవర్తి ఈ సినిమా నిర్మిస్తున్నారనే వార్తలను వర్మ ఖండించారు.

చివర్లో జరిగిన వాస్తవాలు
ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని, ఆయన జీవితం చివర్లో జరిగిన సంఘటనల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరు? ఇదంతా చేశారు అనే విషయాలు సినిమాలో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ వెల్లడించంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో?
అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటికే ప్రకటించారు.

నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!
ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











