twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజం గెలిచిందన్న ఆర్జీవీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ కంప్లీట్!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవిపై అనేక రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 22న విడుదుల కావాల్సింది. కానీ 29కి వాయిదా పడింది.అయినప్పటికీ ఈ చిత్ర విడుదల విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డంకులన్నీ పూర్తయ్యాయి.

    సెన్సార్ గ్రీన్ సిగ్నల్

    సెన్సార్ గ్రీన్ సిగ్నల్

    తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాకు చిన్న చిన్న కట్స్ మినహా మార్పులేమీ సూచించలేదు. దీనితో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. ఆర్జీవీ తాను అనుకున్న కథనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నాడు.

    ఎన్నో అనుమానాలు

    ఎన్నో అనుమానాలు

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వర్మ ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదమైన, చర్చనీయాంశమైన కథని ఎంచుకుని చిత్రంగా మలిచాడు. ఈ చిత్రానికి మొదటి నుంచి తెలుగుదేశంపార్టీ రాజకీయంగా వ్యతిరేకత తెలుపుతూనే ఉంది. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులో కేసులు, ఎలక్షన్ కమిషన్ వద్ద ఫిర్యాదులు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇక సెన్సార్ కూడా పూర్తి కావడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    సంచలనాలకు సిద్ధం

    సంచలనాలకు సిద్ధం

    లక్ష్మీస్ ఎన్టీఆర్ టైలర్స్ తోనే వర్మ పెద్ద చర్చకు తెరలేపాడు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్ర నెగిటివ్ గా ఉండబోతున్నట్లు అర్థం అయిపోయింది. లక్ష్మి పార్వతితో వివాహం, వైస్రాయ్ ఘటన, ఈ చిత్రంలో ఎన్టీఆర్ పిల్లలని వర్మ చూపించిన విధానం ఎన్టీఆర్ కుటుంబానికి ఇబ్బందికర అంశాలుగా మారాయి. ఎన్టీఆర్ తన చివరిరోజుల్లో అనుభవించిన మానసిక క్షోభని, లక్ష్మి పార్వతితో ఉన్న అనుబంధాన్ని వర్మ ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నాడు.

    నిర్మాత వివరణ

    నిర్మాత వివరణ

    ఇక ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ని కలసి చిత్రం గురించి వివరించారు. చిత్రంలో తాము ఎలాంటి అసత్యాలు చూపించడం లేదని. ఎన్టీఆర్ రెండవ సతీమని లక్ష్మీపార్వతి రచించిన పుస్తకం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరక్కించినట్లు రాకేష్ రెడ్డి వివరించారు. దీనితో ఈ చిత్ర విడుదలకు ఎలక్షన్ కమిషన్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ పూర్తి కాగానే ఆర్జీవీ నిజం గెలిచిందని ట్వీట్ చేశాడు.

    English summary
    RGV's Lakshmi's NTR movie completes censor formalities
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X