twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబే విలన్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పాటలో వర్మ టార్గెట్ అదే.. నీ ఉనికే నా జీవితం అంటూ

    |

    ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందే సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో పాటను ఆదివారం (ఫిబ్రవరి 23న) రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య బంధం, అనుబంధంతోపాటు చంద్రబాబును విలన్‌గా చూపే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే..

    నీ ఉనికి జీవితం అంటూ

    నీ ఉనికి జీవితం అంటూ

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని నీ ఉనికి జీవితానికి అర్థం అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా, సిరా శ్రీ సాహిత్యాన్ని అందించారు. కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ పాటలో కీలకంగా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య బలపడిన బంధం, అనుబంధాన్ని చూపించారు.

    చంద్రబాబు విలన్‌గా చూపే

    చంద్రబాబు విలన్‌గా చూపే

    నీ ఉనికి జీవితం పాటలో ఎమోషనల్ కంటెంట్‌తోపాటు చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు మరోసారి స్పష్టమైంది. చంద్రబాబును విలన్‌గా చిత్రీకరించినట్టు అర్ధమైంది. ఎన్టీఆర్ జీవితంలోని చివరి అంకంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు వర్మ వెల్లడిస్తున్నారు.

    ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి చేరువగా

    ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి చేరువగా

    నీ ఉనికి జీవితం పాటలో ప్రధానంగా ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి చేరువైన విధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. లక్ష్మీ పార్వతిని బూచిగా చూపుతూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నం చేసినట్టు ఉంటే సన్నివేశాలను ఈ పాటలో జొప్పించారు. ఈ పాట మెలోడియస్‌గా సాగడం గమనార్హం.

    మెలోడియస్‌గా నీ ఉనికే జీవితం పాట

    మెలోడియస్‌గా నీ ఉనికే జీవితం పాట

    నీ రాకయే నాకు స్వర్గ తూల్యం.. నీ కవితలే పూలగాలుల గంధం.. నీ మాటలే నా స్నేహగ్రంధం అంటూ సాగే పాట ఆకట్టుకొనేలా ఉంది. విరిసే నీ బంధం.. కురిసే మకరంధం.. వెలిగే దీపం.. మిగిలే నేస్తం.. నీవే నా సర్వస్వం.. అంటూ పాట చాలా మెలోడియస్ ఫీలింగ్ కలిగించింది.

    English summary
    Nee Uniki Video Song, Lakshmi's NTR Movie Songs. #LakshmisNTR Movie ft. P Vijay Kumar as NTR, Yagna Shetty as Lakshmi Parvathi and Shritej as CBN. Directed by Ram Gopal Varma and Agasthya Manju. Produced by Rakesh Reddy and Deepthi Balagiri under GV Films. Music composed by Kalyani Malik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X