twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’ కేసును ఇక హైకోర్టులోనే తేల్చుకొంటాం అంటూ

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్గొండ కోర్టు షాకిచ్చింది. కోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు మర్డర్ సినిమా రిలీజ్‌ చేయవద్దని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మర్డర్ సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడింది. బాలాస్వామి అనే ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌ను నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారించింది. ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసు..

    ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసు..

    తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకొన్నారనే విషయంతో అక్కసు పెంచుకొన్న తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ కుమార్‌ను కిరాయి హంతకులతో చంపించడం మిర్యాలగూడ ప్రాంతంలో సంచలనం రేపింది. పరువు హత్యపై రకరకాల వాదనలు వినిపించాయి. ఆ కేసు ప్రస్తుతం నల్గొండ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్నది.

    అమృత స్టోరీ బ్యాక్‌డ్రాప్‌గా మర్డర్

    అమృత స్టోరీ బ్యాక్‌డ్రాప్‌గా మర్డర్

    నల్గొండ జిల్లాలో సంచలన రేపిన ప్రణయ్ కుమార్ పరువు హత్య ఘటనను కథాంశంగా తీసుకొని రాంగోపాల్ వర్మ మర్డర్ పేరుతో సినిమాను తెరకెక్కించారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండగానే వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ కుమార్ తండ్రి పీ బాలస్వామి కేసు నమోదు చేశారు.

    మర్డర్‌ చిత్రంపై అభ్యంతరాలు

    మర్డర్‌ చిత్రంపై అభ్యంతరాలు

    ప్రణయ్ కుమార్ హత్యకేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆర్జీవి మర్డర్ సినిమాను తెరకెక్కించడం వివాదంగా మారింది. అమృత సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 6 తేదీన అమృత మర్డర్ సినిమాను ఆపాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా సినిమా తీయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    ఇరు పార్టీల వాదనలు విన్న కోర్టు

    ఇరు పార్టీల వాదనలు విన్న కోర్టు

    ప్రణయ్ తండ్రి పీ బాలస్వామి, అమృత దాఖలు చేసిన పిటిషన్లపై, అలాగే వర్మ, నట్టి కుమార్ తరఫున నల్గొండ ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. ప్రణయ్ కుమార్ కేసులో తీర్పు వెల్లడయ్యే వరకు మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తాతామంటూ వర్మ తరపు న్యాయవాది తెలిపారు.

    Recommended Video

    Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
    విచారణకు హాజరుకాకుండా తప్పించుకొన్న వర్మ

    విచారణకు హాజరుకాకుండా తప్పించుకొన్న వర్మ

    మర్డర్ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిలు కీలక పాత్రలను పోషించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అమృత పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జరిగిన కోర్టు విచారణకు వర్మ హాజరుకాకండా తప్పించుకోవడం కూడా చర్చనీయాంశమైంది.

    English summary
    RGV's Murder Movie gets set back form Nalgonda SC, ST Court. This court has been directed Director Ram Gopal varma, Producer Natti Kumar for not to release movie, Until the Pranay Kumar case finished.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X