వర్మ సెక్సువల్ ప్లెజర్... 'కోరిక‌'

By Srikanya

హైదరబాద్: నేను సినీ దర్శకత్వం మొదలు పెట్టినప్పట్నుంచీ అన్నీ జోనర్లకు చెందిన సినిమాలు తీసాను. ఉదాహరణకు విద్యార్థి రాజకీయాలు (శివ), ప్రేమకథ (రంగీలా), హారర్‌ (భూత్‌), గ్యాంగ్‌స్టర్‌ (సత్య), డ్రామా (సర్కార్‌), సైకలాజికల్‌ థ్రిల్లర్‌ (కౌన్‌), తీవ్రవాదం (26/11) తరహా సినిమాలు చేసేశాను. ఇక మిగిలింది శృంగార చిత్రమే. ఈ లోటును 'కోరిక' ద్వారా పూర్తి చేసుకుంటాను.నాకు తెలిసి సంకల్ప బలం, శారీరక వాంఛ అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలు. 'కోరిక‌'చిత్రంలో దీన్నే చూపిస్తున్నాను అన్నారు.

నా ఉద్దేశ్యంలో పవన్, సెక్సువల్ ప్లెజర్ అనేవి మనుషుల్లో ఉండే అత్యంత బలమైన ప్రాధమిక ప్రేరేపణలు. విభిన్న సందర్బాల్లో వేరు వేరు మనస్తత్వాలు గల వాళ్లు ...వాళ్లలో కలిగిన శారీరక కోరికలకు సంభందించిన స్పందనల మూలన ఏం చేసారో..వాటి వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నయో వంటి విషయాలను స్టడీ చేసి...ఈ కథను సిద్దం చేసుకున్నాను అని చెప్పారు.

RGV's new film Korika

ఇక ఆయన ఈ చిత్రాన్ని 'ఎక్సెస్‌'(XES)టైటిల్ తో హిందీలో చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతూ... ''నాకు సౌకర్యంగా ఉండే అన్ని రకాల (జోనర్స్‌) సినిమాలు తీసేశాను. ఒక్క శృంగార చిత్రం తప్ప. ఇప్పుడు ఆ సినిమా కూడా చేస్తున్నాను'' అంటూ సంచలన ప్రకటన చేశాడు రామ్‌గోపాల్‌వర్మ. హిందీలో రూపొందబోతున్న ఈ చిత్రానికి 'ఎక్సెస్‌'(XES) అనే పేరు ఖరారు చేసి, పోస్టర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశాడు. వర్మ చెబుతూ ''విద్యార్థి రాజకీయాలు (శివ), ప్రేమకథ (రంగీలా), హారర్‌ (భూత్‌), గ్యాంగ్‌స్టర్‌ (సత్య), డ్రామా (సర్కార్‌), సైకలాజికల్‌ థ్రిల్లర్‌ (కౌన్‌), తీవ్రవాదం (26/11) తరహా సినిమాలు చేసేశాను. ఇక మిగిలింది శృంగార చిత్రమే. ఈ లోటును 'ఎక్స్‌ఎస్‌' ద్వారా పూర్తి చేసుకుంటాను.నాకు తెలిసి సంకల్ప బలం, శారీరక వాంఛ అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలు. 'ఎక్సెస్‌'చిత్రంలో దీన్నే చూపిస్తున్నాను. ఆరు భిన్న పాత్రలకు సంబంధించి శృంగార సన్నివేశాలు, దాని వెనుక ఉన్న కారణాలు సినిమాలో ఉంటాయి'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X