»   » అంతటా శ్రీదేవి నెగిటివిటీ.... పాజిటివిటీ కోసం ‘ఆఫీసర్’ను దించిన వర్మ!

అంతటా శ్రీదేవి నెగిటివిటీ.... పాజిటివిటీ కోసం ‘ఆఫీసర్’ను దించిన వర్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అంతటా శ్రీదేవి నెగిటివిటీ.... పాజిటివిటీ కోసం ‘ఆఫీసర్’ను దించిన వర్మ!

దేశం మొత్తం శ్రీదేవి విషాదంలో మునిగిపోయింది. సినీ తారలు, సినీ అభిమానులు రెండు మూడు రోజులుగా శ్రీదేవి గురించిన నెగిటివిటీ మధ్య జీవిస్తున్నారు. శ్రీదేవి అంటే ఎంతో ఇష్టపడే వర్మ ఈ నెగిటివిటీ నుండి బయటపడాలని నిర్ణయించుకున్నారు. తనను తాను పాజిటివ్ మూడ్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 'ఆఫీసర్'ను రంగంలోకి దింపారు.

ఎవరీ ‘ఆఫీసర్'

రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దించిన ‘ఆఫీసర్' మరెవరో కాదు.... ప్రముఖ నటుడు నాగార్జున. వర్మ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆఫీసర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

కావాలనే చేసిన వర్మ

కావాలనే చేసిన వర్మ

శ్రీదేవిని అమితంగా ఇష్టపడే వర్మ.... ఆమెకు సంబంధించి సంతోషకరమైన విషయాలతోనే గడపటానికి ఇష్టపడతారు. తనకు ఇష్టమైన వారి గురించి బాధ పడుతూ, విషాదంలో ఉండటం ఆయనకు నచ్చదు. దాని నుండి బయట పడాలని, కావాలనే ఆయన ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

యాక్షన్ ఎంటర్టెనర్

యాక్షన్ ఎంటర్టెనర్

‘ఆఫీసర్' మూవీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. గతంలో నాగ్-వర్మ కాంబినేషన్లో ‘శివ' లాంటి ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి.

మే 25న సినిమా విడుదల

మే 25న సినిమా విడుదల

‘ఆఫీసర్' చిత్రానని మే 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఫస్టులుక్ పోస్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తోంది. నాగార్జున కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు.

English summary
"After all the negativity around Sridevi,I am truly wanting some positivity and releasing the title,first look poster od Officer" RGV tweet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu