ఆర్జీవీ ‘ఆఫీసర్’ ప్రమోషన్స్ షురూ.... అసిస్టెంట్లతో అప్పుడు, ఇపుడు!
కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మే నెలలో సినిమా విడుదలవుతున్న నేపత్యంలో వర్మ తనదైన శైలిలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఓ ఫోటో పోస్టు చేవారు.
నాగార్జున హీరోగా వచ్చిన 'శివ' చిత్రం ద్వారా వర్మ దర్శకుడిగా తెరంగ్రేటం చేశారు. అప్పట్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అపుడు 'శివ'కు తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్,....ఇపుడు 'ఆఫీసర్' సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో కలిపి వర్మ ఓ ఫోటో పోస్టు చేశారు.
అప్పట్లో శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన గుణశేఖర్, ఉత్తేజ్, తేజ, కృష్ణ వంశీ, గోపీచంద్ తదితరుల్లో దాదాపుగా అందరూ ఓ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే.
'ఆఫీసర్' చిత్రంలో మైరా సరీన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఆర్ కంపెనీ బేనర్లో సుధీర్ చంద్ర, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో సినిమా వస్తోంది. వర్మ సినిమా అంటేనే విభిన్నంగా ఉంటుంది. మరి 58 ఏళ్ల నాగార్జునను పోలీస్ ఆఫీసర్‌గా వర్మ తెరపై ఎలా చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.


Click it and Unblock the Notifications











