ఆఫీసర్ టీజర్ రిలీజ్.. మనిషిలో దేవుడు.. రాక్షసుడు ఇద్దరూ ఉంటారు.. వర్మ మార్క్‌తో
కింగ్ నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ఆఫీసర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత శివ కాంబినేషన్‌తో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతున్నది. ఇప్పటికే తొలి టీజర్ రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. అదే ఊపులో ఆఫీసర్ చిత్ర రెండో టీజర్‌ను మే 4 తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు.
పాలిటిక్స్, మాఫియాలో బయటకు కనిపించేటివన్నీ నిజం కాదు అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ప్రతీ మనిషిలో దేవుడు, రాక్షసుడు ఇద్దరు ఉంటారు అనే డైలాగ్స్ వర్మ మార్క్ మూవీ మేకింగ్ అద్దం పట్టాయి.
సుధీర్ చంద్ర, రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మైరా తన సినీ రంగ ప్రవేశం చేస్తున్నది. అజయ్, షియాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.



Click it and Unblock the Notifications











