‘ఆఫీసర్’ నాగార్జున రెండో బుల్లెట్.. రేపే ఆర్జీవి ప్లాన్!
కింగ్ నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ఆఫీసర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత శివ కాంబినేషన్‌తో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతున్నది. ఇప్పటికే తొలి టీజర్ రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది.
అదే ఊపులో ఆఫీసర్ రెండో టీజర్‌ను మే 4 తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రెండో టీజర్‌ను మరింత ఆసక్తిగా రూపొందించే పనిలో వర్మ ఉన్నట్టు సమాచారం.

సుధీర్ చంద్ర, రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మైరా తన సినీ రంగ ప్రవేశం చేస్తున్నది. అజయ్, షియాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.
nagarjuna akkineni rgv ram gopal varma officer movie myra sareen అక్కినేని నాగార్జున రాంగోపాల్ వర్మ ఆర్జీవి ఆఫీసర్ మూవీ మైరా సరీన్


Click it and Unblock the Notifications