వర్మ - మంచు విష్ణు చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

ప్రస్తుతం ఆర్.ఎఫ్.సిలో సీన్ విషయానికి వస్తే... నాలుగైదొందల మంది మధ్యలో ఓ నాయకుడు ఉన్నాడు. వాళ్లంతా అతడికి జేజేలుకొడుతున్నారు. అంతలో నాయకుడుని కీర్తిస్తూ పాటందుకున్నాడు మరో అనుచరుడు. దీంతో ఆ ప్రాంతమంతా సందడితో నిండిపోయింది. అక్కడితో అనుకున్న సీన్ అయిపోయిందేమో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కట్ చెప్పేశారు. ఇదీ రామోజీఫిల్మ్‌సిటీలోని ప్రియా డెయిరీ దగ్గరి పరిస్థితి.
అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.
కాగా...'దూసుకెళ్తా' విజయంతో మంచి జోష్ మీద ఉన్న విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌తో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో నటిస్తున్నాడు


Click it and Unblock the Notifications











