వర్మ ‘పట్టపగలు’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ అత్యంత ఇష్టమైన జెనర్ ఏదీ అంటే హర్రర్ అన్నట్లుగా ఆయన వరసగా ఆ సినిమాలు దింపుతూండటం జరుగుతున్నదే. అయితే అవి భాక్సాఫీస్ వద్ద అలరించకపోయినా వాటి బడ్జెట్ తక్కువ కావటంతో పెద్దగా నష్టం కూడా జరిగిన ధాకలాలు ఉండవు. అయితే ఎప్పటికైనా జనాలను భయపెడతానని, అదే తన లక్ష్యం అన్నట్లు చెప్పే వర్మ ఈ సారి పట్టపగలు అనే చిత్రంతో వస్తున్నారు. ఈ రోజు మిట్ట మధ్యాహ్నం ఆ చిత్రం ట్రైలర్ ని వదిలారు. దాని లింక్ ఇదే..
హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.
దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు. రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/XeKQG0gNaHw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











