ఈ బొమ్మైనా ఆడుద్దా బాసూ

By Srikanya

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం జూన్ 6 వ తేదీన విడుదల చేయటానికి నిర్ణయం చేసారు.

ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వరస సినిమాలు ప్రారంభించిన వర్మ... మొన్నీ మధ్య రౌడీ అంటూ ముందుకు వచ్చారు. మంచు కుటుంబ ప్యాకేజి చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. మంచు విష్ణు ..మీడియా ముందుకు వచ్చి..మా సినిమాకు బాగా డబ్బులొచ్చాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది.

RGV's 'Pattapagalu' comes on June 6th

ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ పెద్ద ఇంప్రెసివ్ లేవంటూ విమర్శలు బాగా వచ్చాయి. హర్రర్ జానర్ అనేది ఎక్కడా కనపడటం లేదని, ఈ సినిమాతో వర్మ అనుకున్న భయం తేగలగుతారా లేక వర్మ సినిమాలంటే ఉన్న భయం మరింత పెరుగుతుందా అనేది ఆసక్తికరంగా సినీ జనాలు ఎదురుచూస్తున్న అంశం.

హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.

దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు. రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X