twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ కొత్త సినిమా ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ షురూ

    By Bojja Kumar
    |

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య 26/11 సంఘటనపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ మేరకు వర్మ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    ''ఈ రోజు నా కెరీర్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సినిమా 'ది అటాక్స్ ఆఫ్ 26/11' షూటింగ్ మొదటి రోజు. నా కెరీర్లోనే అని ఎందుకన్నానంటే ఇంత వరకు ఎక్కడా జరుగనటువంటి అత్యంత ప్రాణాన్యత గల సంఘటన ఆధారంగా ఇది చిత్రీకరించబడుతోంది కాబట్టి. ఇంత వరకు జరిగిన ఇలాంటి సంఘటనలతో పోలిస్తే వాటి పరిమాణంలో కానీ, జరిగిన నష్టంలో కానీ, ఏర్పడిన విషాదకర పరిస్థితుల్లో కానీ ఇది సమానం కానప్పటికీ ఇందులో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను బట్టి చూసినట్లయితే దీని ముందు 9/11 కూడా వెనుకబడుతుంది.

    ఈ సంఘటనను సినిమాగా రూపొందించడానికి అత్యంత విలువైన సమాచారాన్ని నాకందించిన ఆఫీసర్స్ కు అందరికీ నేను ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మొత్తం పూర్తిగా కొత్త వాళ్లతో మరియు నిజంగా ఆయా పాత్రలు, ఆ సంఘటనా సమయంలో మాట్లాడిన ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు మరాఠీ భాషల్లో షూట్ చేయబడుతుంది. అంతర్జాతీయంగా విడుదల చేయడమే లక్ష్యంగా గల ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 40 కోట్లు.

    ఇందులో అమర్ సోలంకి నుంచి చేపలు పట్టే 'కుబేర్' అనే బోట్ స్వాధీనం చేసుకోవడం నుంచి, సిఎస్‌టి స్టేషన్ లో జరిగిన హత్యలు మరియు తాజ్ లో జరిగిన మారణకాండతో పాటు, కసబ్ ను హింసించే వరకూ అన్ని సన్నివేశాలు అత్యంత వివరంగా చూపబడతాయి. ఈ సినిమాలో అందరికంటే ప్రధానమైన నటుడు ఖచ్చితంగా కసన్ పాత్రను పోషించే అతను. కసబ్ లాంటి రూపంతో పాటు, సన్నివేశాల్లో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను అద్భతుంగా కనబరచగల నటుడి కోసం వెతుకుతూ, సంజయ్ జైస్వాల్ అనే ఒక స్టేజ్(థియేటర్)ఆర్టిస్టును ఎంపిక చేశాను'' అని వర్మ చెప్పుకొచ్చారు.

    English summary
    Filmmaker Ram Gopal Varma's most ambitious film on 26/11 Mumbai attacks finally goes on floors Friday and it will be shot in four different languages - Hindi, Marathi, English and Urdu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X