ఎన్నికల ముందు...రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం!
హైదరాబాద్: వివాదాలతో సావాసం చేయడం అంటే రామ్ గోపాల్ వర్మకు మహా ఇష్టం. అందుకే కాబోలు ఆయన వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడానికే ఆసక్తి చూపుతుంటారు. రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య 'రెడ్డి గారు పోయారు' అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నానంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసాడు వర్మ.
పరిస్థితులను తన సినిమాలకు అనుకూలంగా మార్చుకోవడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు వర్మ విడుదల చేయబోతున్న ఈచిత్రంలో ఏం చూపెట్టబోతున్నారు? అనేది చర్చనీయాంశం అయింది. వర్మ చూపెట్టబోతున్న ఆరెడ్డిగారు ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....రామ్ గోపాల్ వర్మ ఈచిత్రంలో రాష్ట్ర విభజన పరిస్థితులను చూపెట్టబోతున్నారని, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఈచిత్రంలో చూపెట్టబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య 'రెడ్డి గారు పోయారు' సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ.... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణమిత్రుడు కెవిపి రామచంద్రావును కూడా వర్మ కలవాలనుకున్నాడు. సినిమా కోసం వస్తున్నట్లు తెలియడంతో తర్వాత భేటీని రద్దు చేసుకున్నానని కెవిపి రామచందర్ రావు చెప్పారు.


Click it and Unblock the Notifications











