twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రౌడీ’కి నాగ్ ‘శివ’కనెక్షన్

    By Srikanya
    |

    హైదరాబాద్: వర్మ కెరీర్ ప్రారంభంలో వచ్చిన శివ చిత్రం చూడని తెలుగు వారు ఉండరు. అందులో సైకిల్ చైన్ సీన్ అయితే మర్చిపోరు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మరోసారి రౌడీ లో గుర్తు చేయటానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. ఆ సీన్ కు ఇచ్చిన నేపధ్య సంగీతాన్ని ఈ చిత్రంలో వాడుతున్నారు. అదే విషయాన్ని వర్మ స్వయంగా తెలియచేసారు.

    వర్మ మాట్లాడుతూ... 1989 లో వచ్చిన సైకిల్ చైన్ సీన్ కు ఇళయరాజా ఇచ్చిన నేపధ్య సంగీతం ఇప్పటికీ మరిచిపోలేను. అందుకే సాయి కార్తీక్ తో చెప్పి అదే నేపధ్య సంగీతం రౌడీ చిత్రంలో 17వ ట్రాక్ లో పెట్టించాను. అది చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. ఏప్రియల్ 4న విడుదల కానుంది.

    RGV’s Rowdy has a ‘Shiva’ connect

    మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రౌడీ'. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఏప్రిల్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ... ఒకటీ, ఒకటీ కలిస్తే ఒకటే! ఇదీ రాయలసీమ లెక్క. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిస్తే ఒక్కరే మిగులుతారు. ఇద్దరు మిత్రులు కలిస్తే.. ఒక్కటైపోతారు. రాయలసీమలో ఉండే 'అన్న' సిద్ధాంతం ఇదే. ఇంతకీ ఆయనేం చేశాడో..? అన్నగా ఏం సాధించాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.

    అలాగే ''నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. విశ్రాంతి సన్నివేశం ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే విడుదలకు ముందు ప్రత్యేకంగా ఈ సినిమా కొంతమంది మహిళా ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించాం. శనివారం విశాఖపట్నం, బెంగళూరులో 'రౌడీ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని కొంతమంది ప్రేక్షకులకు చూపిస్తాము''అన్నారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ... ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు

    అలాగే ... రామ్‌గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

    English summary
    Ram Gopal varma Said...“I still can’t forget the goose bumps I got back in 1989 when Ilayaraja was scoring music for the cycle chase sequence in Shiva. I wanted to bring the attention to track number 17 in the album “Rowdy” . As a tribute to Ilayaraja, I asked Sai Kartik to do an integration of the brilliant cycle chase theme from Shiva into the main theme of “Rowdy” and it turned out to be brilliant,” RGV said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X