రామ్ గోపాల్ వర్మ ‘సావిత్రి’ (హాట్ ఫోటోస్)
హైదరాబాద్: ప్రతి టీనేజర్ జీవితంలో ఒక ‘సావిత్రి' ఉంటుంది. నేను స్కూల్ లో చదువుకొనేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ ‘సరస్వతి' అంటే నాకు పిచ్చెక్కిపోయేది. ఆ సరస్వతే నా ‘సావిత్రి' సినిమా ....అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ....ఈ చిత్రం ద్వారా మరో వివాదానికి తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది. కారణం ఈ సబ్జెక్టు కాస్త కాంట్రవర్సల్ గా ఉండటమే.
సినిమా గురించి వర్మ చెబుతూ....నాకు సరస్వతి టీచర్ ఉన్నట్లే మీమీ జీవితాతల్లో..మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్సో, మీ ట్యూషన్ టీచర్లో...ఇలా రకరకాల ‘సావిత్రి'లు ఉండే ఉంటారు. అలాగే మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి ఇన్స్ పిరేషన్ తోనే ఈ ‘సావిత్రి' సినిమా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

మీ సావిత్రి కాంటెస్ట్
ఈ సందర్భంగా ‘మీ సావిత్ర ఎవరు?' అనే కాంటెస్ట్ మొదలు పెడుతున్నట్లు వర్మ తెలిపారు.

అనుభవాల గురించి
ఈ కాంటెస్టులో పాల్గొనాలనుకునే వారు మీమీ జీవితాల్లో ఎదురైన సావిత్రిల గురించి అనుభవాలను చెప్పాల్సి ఉంటుందని వర్మ తెలిపారు.

ఇలా...
సావిత్రిలకు సంబంధించిన అనుభవాలను naasaavitri.com లో పంచుకోవాల్సి ఉంటుంది.

సినిమాలో చేరుస్తారు..
పోటీ దారుల అనుభవాలు ఆసక్తికరంగా ఉంటే...వాటిని సావిత్రి సినిమాలో పెడతామని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











