వర్మ 'సత్య; సీక్వెల్...డిటేల్స్
ముంబై: రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం. విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ భూత్ 2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్, ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ తీసిన హారర్ చిత్రం 'భూత్' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది. 'భూత్-2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వర్మ త్రీడిలో రూపొందిస్తున్నారు. గతంలో అజయ్ దేవగన్, ఊర్మిళతో వర్మ తీసిన 'భూత్' సినిమా చక్కని విజయాన్నే సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు వర్మ. 'భూత్-2' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. హీరో హీరోయిన్లు పాడుబడిన బంగళానుండి బయటకు రావటం 'భూత్'లో చివరి సన్నివేశం. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి, మనీషా కోయిరాలా ఆ బంగళాలోకి ఎంటరవటంతో సీక్వెల్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ.
మనీషా కోయిరాల 'భూత్-2' తో రీ-ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమాతో మళ్ళీ పాత వర్మను చూస్తారని హీరోగా నటిస్తున్న జెడి. చక్రవర్తి అన్నారు. ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి మధుశాలిని నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











