రజనీకాంత్ పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ కామెంట్
రామ్ గోపాల్ వర్మ ఎదుటి వారిని కామెంట్ చేయటంలో సిద్ద హస్తుడు. తాజాగా ఆయన రజనీకాంత్ గురించి మాట్లాడుతూ...స్టార్ కావాలంటే..గుడ్ లుక్స్, గ్రేట్ హైట్, వెర్శటైల్ ఏక్టింగ్, సిక్స్ పాక్ బాడీ లాంటివన్నీ అవసరం. అయితే ఇవేమీ లేకపోతే అతను సూపర్ స్టార్ రజనీ అవుతారు అని ట్వీట్ చేసారు. రజనీ రోబో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేఫద్యంలో ఈ కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో అవతార్ చిత్రం చూసి ..జేమ్స్ కెమెరాన్ ని సినిమా దేముడుగా అభివర్ణించిన వర్మ..రోబో చూసి శంకర్ ని ఎలా కామెంట్ చేస్తారో అని అంతా ఎదురుచూస్తుంటే ఆయనిలా ప్రతిస్పందించారు. ప్రస్తుతం వర్మ..సునీల్ హీరోగా కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం ..అప్పలరాజు అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత బెజవాడ రౌడీలు అనే చిత్రం చేస్తానని ప్రకటించారు.
రామ్ గోపాల్ వర్మ రజనీకాంత్ రోబో జేమ్స్ కెమరాన్ అవతార్ అప్పలరాజు robo rgv rajanikanth james cameran avathar appala raju


Click it and Unblock the Notifications