»   » చిరు 150 వ చిత్రంపై వర్మ సెన్సేషన్ కామెంట్స్

చిరు 150 వ చిత్రంపై వర్మ సెన్సేషన్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150 వ సినిమాకు క్రేజ్ ఏ రీతిలో ఉంటుందో లేదో కానీ ..మీడియాలో మాత్రం ఈ చిత్రం గురించి రోజుకో వార్తతో ఎప్పుడూ హాట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. దానికి తోడు వర్మ కూడా ఆయన ఆ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ కామెంట్స్ చేసారు.ఆ కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ... " చిరంజీవి గారు...తన 150వచిత్రం తనే డైరక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే...నాకు ఆయనతో ఉన్న ఇంట్రాక్షన్ తో ఆయనకు అందరి దర్శకుల కన్నా ఎక్కువ విషయాలు సినిమా గురించి తెలుసు.అదే చిరంజీవి గారు...త్రివిక్రమ్, వినాయిక్ వంటివారితో చేస్తే...అది మరో చిత్రం అవొచ్చేమో కానీ...అదే ఆయనే స్వయంగా డైరక్ట్ చేసుకుంటే అది ఆయన చిత్రం అవుతుంది...

RGV’s sensational comments on Chiru’s 150th

నాకు బాగా నమ్మకం చిరంజీవి గారు..తన 150 వ సినిమా ని డైరక్ట్ చేసుకునే తెలివి, జ్ఞానం ఉన్నాయి. అదే చిరంజీవి గారు తన 150 చిత్రం డైరక్ట్ చేయకపోతే... అది ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కన్నా పెద్ద తప్పు అవుతుంది... చిరంజీవి గారు తన 150వ సినిమా ని తనే డైరక్ట్ చేసుకోవటం అనేది ఈ మూడు దశాబ్దాలలో ఓ స్పెక్టిక్యులర్ ఈవెంట్ అవుతుంది. ఆయన నిజమైన అభిమానులు...ఖచ్చితంగా ఆనందిస్తారు..".

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.

కొంతకాలం క్రితం బెంగుళూరులో చిరంజీవి మాట్లాడుతూ...చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు.

గతంలోనూ చిరంజీని ఉద్దేశించి..వర్మ కామెంట్స్ చేసారు..

ఆ కామెంట్స్ ఇలా ఉన్నాయి..అందరు లీడర్స్ జైల్ కి వెళ్ళి పోయారు..చిరంజీవి గారు ఒక్కరే మిగిలిపోయి సి ఎం అయిపోయినట్లు నాకు నిన్న రాత్రి కల వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాజా ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ సంగతి తెలుసుకున్న చిరంజీవి చాలా హ్యాపీ ఫీలైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన వ్యగ్యంగా చిరంజీవి అన్నా సీఎం అవుతారనే మాట చిరుకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక గతంలోనూ రామ్ గోపాల్ వర్మ చిరంజీవిని ఉద్దేశించి చాలా ట్వీట్స్ చేసారు. ఆ మధ్యన చిరంజీవి సినిమాని డైరక్ట్ చేయాలని ఉందని,దాని పేరు దొర..ది లార్డ్ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి చాలా స్లిమ్ గా తయారయ్యారని, పవన్, రామ్ చరణ్ ల కన్నా చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేసారు.

English summary
Ram gopal varma tweets goes as follows: “I hope chiranjeevi gaaru will direct his 150th film himself because from whatever my interaction with him he knows more than every director...If Chiranjeevigaaru works wth directors Trivikram Vinayak etc it will be just another etc film but if he does himself it will b the film...I am very sure that Chiranjeevigaaru has the wisdom nd intelligence to direct his 150th film himself... If Chiranjeevigaaru doesn't direct his 150 th film himself it will be a bigger mistake than him starting prajaraajyam party...Chiranjeevigaaru directing his 150th film himself wil b a spectacular event of his 3 decades and his truly true fans will have an orgasm”.
Please Wait while comments are loading...