»   » ‘రౌడీ’తో పూర్తి స్థాయి నటుడిగా మారానంటున్న విష్ణు

‘రౌడీ’తో పూర్తి స్థాయి నటుడిగా మారానంటున్న విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్ర ధారులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రౌడీ'. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ గురించి విష్ణు మాట్లాడుతూ...'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను. పూర్థి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగింది. రామ్ గోపాల్ వర్మ నాలోని పూర్తి స్థాయి నటుడిని వెలికి తీసాడు' అని తెలిపారు.

RGV's Sentimental Touch To Rowdy Impresses Producers

ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, కమర్షియల్ హంగులతో పాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయని విష్ణు తెలిపారు. ''నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. ఇంటర్వెల్ ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అన్నారు.

రౌడీ' చిత్రంలో మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రౌడీ ఆడియోకు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు తెలిపారు.

English summary
Director Ram Gopal Varma (RGV) is known for making crime-based films, but he has surprised the makers with the sentimental touch he has given to his forthcoming Telugu release Rowdy. This emotional scene features Mohan Babu and Jayasudha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu