నాగార్జున ‘శివ’ రీ రిలీజ్ డేట్ ఖరారైంది
హైదరాబాద్: నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ' అప్పట్లో భారీ విజయం సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఈచిత్రాన్ని ట్రెండ్ సెట్టర్ గా చెబుతుంటారు. ఇటీవలే ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనిట్ సభ్యులంతా కలిసి వేడుక చేసుకున్నారు. అభిమానుల కోసం ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 21న 100 ధియేటర్లలో దీన్ని రిజలీ చేస్తారట. ఈ సినిమాకు మళ్లీ మంచి కలెక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం నాగార్జున మాట్లాడుతూ...- ''జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ' అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... శివ సినిమాతో అందరూ నేను రూల్స్ బ్రేక్ చేసానని అంటూంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు రూల్స్ అనేవే తెలియదు. అందుకే ఆ చిత్రం ట్రెడ్ సృష్టించింది. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే శివ కేవలం నాగార్జున వల్లే సాధ్యమైంది అన్నారు.


Click it and Unblock the Notifications











