'పవన్ పాదయాత్ర': వర్మ సంచలన వ్యాఖ్యలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ :రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి దారి తీస్తూంటాయి. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఆయన పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు.
ఆ ట్వీట్స్ ఇలా సాగాయి...'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా వివరణ ఇస్తూ... తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది'. సమంత, ప్రణీత హీరోయిన్స్ . త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని తొలుత ఈనెల 7న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత 9న తీసుకొస్తామన్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా రావడం లేదు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల తేదీ మారుస్తున్నాం. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తామనేది త్వరలో చెబుతాం'' అన్నారు.
ఇంకా పవన్ మీద..వర్మ చేసిన ట్వీట్స్ స్లైడ్ షో లో...

షర్మిల పాదయాత్ర లాగ...
వైయస్సాపీ నాయకురాలు షర్మిల పాదయాత్రను ప్రస్దావిస్తూ... ఆమె పాద యాత్ర చాలా మంది ఫాలోయర్స్ ని మేల్కొపినట్లే...పవన్ పాద యాత్ర చేస్తే...హిస్టరీ క్రియేట్ అవుతుందని అన్నారు. ఆయన చేసే పాదపాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వర్మ. పవన్ కళ్యాణ్ పాద యాత్ర చేయాలనే ఆలోచన ఈ రకంగా..ఆయన ఇచ్చారు.

మహాత్మాగాంధీ పాదయాత్ర...
పవన్ కళ్యాణ్ గనుక పాద యాత్ర చేస్తే కనుక...అది మహాత్మా గాంధీ పాదయాత్రను గుర్తు చేస్తుంది అని నేను చెప్పగలను అంటూ పవన్ ని ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. అప్పట్లో మహాత్మా గాంధీ పాద యాత్ర కి జనం చాలా మంది వచ్చారు. అదే విధంగా పవన్ కీ ఫాలోవర్స్ ఉన్నారని వర్మ అన్నారు.

చిరు కన్నా పెద్ద స్టార్
పవన్ కళ్యాణ్ ..కనుక చిరంజీవి కు సోదరుడు కాకపోయి ఉంటే కనుక తప్పకుండా చిరంజీవి కన్నా పెద్ద స్టార్ అయ్యేవాడని అన్నారు. పవన్ ఎక్సప్రెషన్స్ అద్బుతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్స్ పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అయితే ఈ విషయమై పవన్ మాత్రం ఏమీ స్పందించలేదు. స్పందరనే అనుకుంటున్నారు.

ఎందుకీ ట్వీట్స్
ఇక వర్మ ట్వీట్ చేసాడంటే ప్రతిఫలం లేకుండా చేయడని అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎందుకిలా వర్మ..పవన్ ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేసాడనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. గతంలోనూ చిరంజీవి గురించి ఆయన చేసిన ట్వీట్స్ చర్చనీయాంసంగా మారాయి. ఆయనతో సినిమా చేయాలని ఉందని దానికో టైటిల్ కూడా ఆయన ప్రకటించారు.

రక్త చరిత్ర లో పవన్ ప్రస్దావన
గతంలో వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో పవన్ కళ్యాణ్ ..గుండు సీన్ పెట్టారంటూ మీడియాలో ప్రముఖంగా ప్రస్దావన వచ్చి దుమారం రేగింది. అయితే అది తర్వాత సినిమాలో కనిపించలేదు. ఆ సీన్ తీసేసారని తర్వాత వర్మ మీద రాసిన పుస్తకంలో సైతం ప్రస్దావించారు. అయితే అప్పుడు విరోధంగా బిహేవ్ చేసిన వర్మ ఇలా పొగడ్తల్లో ముంచెత్తటం ఆశ్చర్యకరమైన అంశమే అంటున్నారు.

రక్త చరిత్ర లో పవన్ ప్రస్దావన
గతంలో వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో పవన్ కళ్యాణ్ ..గుండు సీన్ పెట్టారంటూ మీడియాలో ప్రముఖంగా ప్రస్దావన వచ్చి దుమారం రేగింది. అయితే అది తర్వాత సినిమాలో కనిపించలేదు. ఆ సీన్ తీసేసారని తర్వాత వర్మ మీద రాసిన పుస్తకంలో సైతం ప్రస్దావించారు. అయితే అప్పుడు విరోధంగా బిహేవ్ చేసిన వర్మ ఇలా పొగడ్తల్లో ముంచెత్తటం ఆశ్చర్యకరమైన అంశమే అంటున్నారు.

పవన్ ,వర్మ కాంబినేషన్???
ఇక ఈ ట్వీట్స్ ఉద్దేశ్యం తాను పవన్ కి కథ చెప్పటానికో ,దర్శకత్వం వహించాడనికో కాదని వర్మ చెప్తున్నారు. అయితే గతంలో పవన్ హీరోగా వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేద్దామనుకుని అది స్టోరీ దశలోనే ఆగిపోయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తూంటారు. పవన్ కి నచ్చే కథ వర్మ చెప్పలేదని, అది దృష్టిలో పెట్టుకుని పవన్ తో రక్త చరిత్రలో పవన్ ని గుర్తు చేసాలా ..గుండు గీయించే సీన్ పెట్టారని, అయితే అది తర్వాత తీసేసారని చెప్తూంటారు.

'అత్తారింటికి దారేది'
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది'. సమంత, ప్రణీత హీరోయిన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని తొలుత ఈనెల 7న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత 9న తీసుకొస్తామన్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా రావడం లేదు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల తేదీ మారుస్తున్నాం. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తామనేది త్వరలో చెబుతాం'' అన్నారు.


Click it and Unblock the Notifications











