For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  లైవ్ డిబేట్ లోనే పోర్న్ చూశాడా?, చివరి అనుభవమెప్పుడని సమరంకు వర్మ ప్రశ్న?..

  |

  నిన్న మొన్నటిదాకా క్రైమ్, మాఫియా వెంటపడ్డ రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు 'సెక్స్' కంటెంట్ వెంటపడ్డారు. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా.. యథావిధిగా తన పని తాను చేసుకుపోతానని కుండబద్దలు కొడుతున్నారు. అటు మీడియా ఛానెళ్లకు కూడా వర్మ 'గాడ్ సెక్స్&ట్రూత్' ఇప్పుడో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా టీవి9 వేదికగా జరిగిన డిబేట్ లో డా.సమరంను సైతం ఇబ్బందిపెట్టారు వర్మ..

   సమరం అభిప్రాయం ఇది..:

  సమరం అభిప్రాయం ఇది..:

  చర్చా కార్యక్రమంలో భాగంగా వర్మతో డిబేట్ కోసం సెక్సాలజీ నిపుణులు డా.సమరంను కూడా కూర్చోబెట్టారు. సెక్స్ ఎడ్యుకేషన్ కు పోర్న్ కు తేడా ఉందని.. పోర్న్ వల్ల దుష్ప్రభావాలే తప్పితే మంచి అనేదే ఉండదని సమరం అన్నారు.

  అంతేకాదు, పోర్న్ చూడటం వల్ల యువతలో లేనిపోని అపోహలు కూడా పెరిగిపోయే అవకాశం ఉందని.. ఆ తర్వాత అవి వాళ్ల వైవాహిక జీవితాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతాయని అన్నారు.

  మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
   సమరంకు వర్మ ప్రశ్నలు..:

  సమరంకు వర్మ ప్రశ్నలు..:

  సమరం చేసిన వ్యాఖ్యలతో విభేదించిన వర్మ.. మరింత బోల్డుగా ఆయనకు ప్రశ్నలు సంధించాడు. 'సమరం గారూ.. మీరు చివరిగా ఎప్పుడు సెక్సులో పాల్గొన్నారో చెప్పండి', 'ఎన్నిసార్లు మీరు పోర్న్ చూశారో కూడా చెప్పండి?' అంటూ వర్మ ప్రశ్నించారు.

   టీవి వేదికల్లో ఇలాంటి ప్రశ్నలా?:

  టీవి వేదికల్లో ఇలాంటి ప్రశ్నలా?:

  తాను సెక్సాలజీ డాక్టర్‌ను కాబట్టి.. పోర్న్ పోకడల గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కేవలం అవగాహన కోసం మాత్రమే వాటిని చూశానని సమరం అన్నారు. ఇక తాను తొలిసారి ఎప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను?.. మొదటిసారి ఎప్పుడు సెక్స్ చేశాను, భార్యతో ఏం చేస్తాను?, వంటివన్నీ వ్యక్తిగతంగా చర్చించగలను కానీ టీవి వేదికల్లో ఇలాంటి ప్రశ్నలు సరికాదన్నారు.

   లైవ్ లోనే వర్మ 'పోర్న్' చూశారా?:

  లైవ్ లోనే వర్మ 'పోర్న్' చూశారా?:

  ఇక ఈ చర్చా కార్యక్రమం సందర్భంగా పలువురు మహిళల అభిప్రాయాలను కూడా వినిపించారు. ఆ క్రమంలో ఓ మహిళ మాట్లాడిన వీడియో బైట్‌ను ప్రసారం చేస్తుండగా.. వర్మ తన మొబైల్ ఫోన్‌లో మునిగిపోయారు. ఇంతలో టీవి యాంకర్ రజనీకాంత్.. పోర్న్ చూస్తున్నారా? అని ప్రశ్నించగా.. 'ఎస్'.. అంటూ సమాధానమిచ్చారు వర్మ.

  వర్మపై కేసు:

  వర్మపై కేసు:

  బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీఎస్‌టీ వెబ్‌ సిరీస్‌ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

   బీజేపీ మహిళా మోర్చ విమర్శలు:

  బీజేపీ మహిళా మోర్చ విమర్శలు:

  వర్మపై ఫిర్యాదు చేసిన సందర్భంగా పలువురు బీజేపీ మహిళా మోర్చ నేతలు మీడియాతో మాట్లాడారు. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి నీచమైన సినిమాలు చేస్తున్నాడని విమర్శించారు.

  అందుకే భార్యతో పాటు కూతురు కూడా ఆయన్ను వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్‌ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు.
  బీజేపీ మహిళా మోర్చా సభ్యుల ఫిర్యాదు. విజయవాడ సూర్యారావుపేటలో. సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచమైన సినిమాలు చేస్తున్నారు.

  English summary
  Director Ramgopal Varma argued with sexologist Samaram over Porn issue, in an TV debate. Ramgopal Varma said he never steps back regarding GST-God Sex&Truth.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more