స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఎగిరి గంతులేస్తారు.. బాలయ్య పాటపై ఆర్జీవీ సెటైర్స్

ఎవరి వృత్తి వారు చేస్తేనే బాగుంటుంది. నటించే వారు నటించాలి.. పాడే వారు పాడాలి. అయితే కొందరు అన్ని రకాల విద్యలు వస్తాయి.. వారి శాతం చాలా తక్కువే అనుకోండి. అయితే నేడు ఉన్న టెక్నాలజీలో ఎలాంటి గొంతునైనా కోయిల పాటల మార్చేయగలం. అలా అని పాటలను కూనీ చేయకూడదు కదా. కానీ బాలయ్య మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదనిపిస్తోంది.

 నాటి క్లాసిక్ సాంగ్..

నాటి క్లాసిక్ సాంగ్..

నాటి క్లాసిక్ సాంగ్ శివశంకరీ పాట మీద పడ్డాడు. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరునికథలోని ఆ పాటను ఘంటసాల అద్భుతంగా పాడారు. ఆ పాటలోని మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడం ఎస్పీబీ వంటివారికి కూడా సుసాధ్యమే. అయితే బాలయ్య మాత్రం ఆ సాహసం చేశాడు.

పాటలపై మోజు..

పాటలపై మోజు..

ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ వీరావేశంగా "నీ కంటి చూపుల్లోన" పాట పాడగా అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ సినిమాలో అయితే ఏకంగా ఆ గొంతునే రింగ్‌టోన్‌గా పెట్టేసుకున్నారు. అయితే అది వెక్కిరించడానికా? అభిమానంతోనా? అన్నది వారికే తెలియాలి.

విమర్శల పాలు..

విమర్శల పాలు..

పూరీ జగన్నాథ్ సినిమా పైసా వసూల్‌లో ‘మామ ఎక్ పెగ్ లా' పాటని అతి కష్టం మీద ట్యూన్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే అది తాగుబోతుల సాంగ్ కాబట్టి ఎలా పాడినా నడిచింది. కానీ శివ శంకరి పాట అలా కాదు. ఆ పాట పాడి మరోసారి బాలయ్య విమర్శలపాలయ్యాడు.

 ఆర్జీవీ స్పందన.

ఆర్జీవీ స్పందన.

బాలయ్య పాటపై ఆర్జీవీ స్పందించాడు. ‘వావ్ మహమ్మద్ రఫీ, ఎస్పీబీ కూడా పాడటంలో జూనియర్లే. ఆయన పాడి పాట, ఆ స్వరాల, ఆ శబ్దాలు వింటే శ్రోతల హృదయ స్పందన పెరుగుతుంది. ఒతెల్లో బల్లాడ్ శంకర శాస్త్రి మోజార్ట్‌ల కలయికలా ఉంద'ని ట్వీట్ చేశాడు.

Recommended Video

#DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
స్వర్గంలోని ఎన్టీఆర్ గంతులు..

స్వర్గంలోని ఎన్టీఆర్ గంతులు..

తాజాగా వర్మ స్పందిస్తూ.. ‘తన కామెంట్లను కొంతమంది చెడ్డవారు జోక్‌ చేశానని అంటున్నారు కానీ దేవుడు, బాలయ్య మీద ఒట్టేసి చెబుతున్నా.. సంగీతం కనుగొన్నప్పటి నుంచి నేటి వరకు విన్న పాటల్లో ఇదే గొప్ప పాట. నాకు తెలిసి స్వర్గంలోని ఎన్టీఆర్ కూడా సంతోషంతో గంతులు వేస్తుంటారు'అని మరో ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X