twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకో 24 గంటల్లో కేసు ఖతం.. సీబీఐపై వర్మ సెటైర్స్.. సుశాంత్ ఇష్యూపై దృష్టి పెట్టిన ఆర్జీవీ!!

    |

    సుశాంత్ సింగ్ మరణంపై ఎన్నో రకాల అనుమానాలు, ఇంకెన్నో ట్విస్ట్‌లు బయట పడుతూనే ఉన్నాయి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు నిర్దారించారు. ఇక సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్‌ది హత్య అని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సుశాంత్ మరణించడంతో దీనికి కారణం బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ విరుచుకపడ్డారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి టార్గెట్ అయింది.

    Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu
    సుశాంత్ తండ్రి ఫిర్యాదు..

    సుశాంత్ తండ్రి ఫిర్యాదు..

    సుశాంత్ కేసులో బాలీవుడ్ మాఫియా హస్తం ఉందని, నెపోటిజం వల్లే ప్రాణాలు కోల్పోయారని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో చేసిన ఫిర్యాదుతో రియా చక్రవర్తిపై ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఇక అక్కడి నుంచి ఈ కేసు మహారాష్ర, బీహార్ రాష్ట్రాల మధ్య వివాదాన్నిరేపింది. ఈ వివాదం కాస్తా సుప్రీం కోర్టు వద్దకు వెళ్లింది.

    సీబీఐకి అప్పగించిన కోర్ట్..

    సీబీఐకి అప్పగించిన కోర్ట్..

    సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదును, ఆ కేసును మహారాష్ట్రకు మార్చాలని రియా చక్రవర్తి వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా బీహార్ పోలీసులకు విచారణకు మహారాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఈ కేసును వెంటనే సీబీఐ చేజిక్కించుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

    ఆర్జీవీ సెటైర్స్..

    ఆర్జీవీ సెటైర్స్..

    సుశాంత్ మరణంపై, ఆపై వచ్చిన ట్రోలింగ్‌పై ఆర్జీవీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది, అయినా నెపోటిజం వల్ల ఎవ్వరూ స్టార్ హీరోలు కారని, ప్రజలు ఒప్పుకుంటేనే స్టార్స్ అవుతారని ఆర్జీవీ చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇక సీబీఐకి అప్పగించడంపైనా ఆర్జీవీ సెటైర్ వేశాడు.

    ఇంకొక్క రోజులో కేసు ఖతం..

    ఇంకొక్క రోజులో కేసు ఖతం..

    68 రోజుల్లో ముంబై పోలీసులు చేయలేనిది సీబీఐ ఒక్క రోజులో చేసిందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆర్జీవీ స్పందించాడు. ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. ఒకవేళ సీబీఐ 24 గంటల పనితనం ముంబై పోలీసుల 68 రోజుల పనితనం ఒకటే అయితే రాబోవు 24 గంటల్లో సుశాంత్ కేసు పరిష్కరించబడుతుందన్న మాట.. వావ్ అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి ఆర్జీవీ సుశాంత్ కేసు, సీబీఐ విచారణపై బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

    English summary
    RGV Satires On CBI Investigation In Sushant Singh Case. If CBI’s 24 hours is equivalent to 68 days of Mumbai Police investigation , then that means CBI will solve the case in next 24 hours ..WOWWEEEEE!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X