ఐన్‌స్టీన్ కూడా మూగబోతాడు.. మెగా బ్రిలియెన్స్ అంటూ ట్వీట్.. మళ్లీ గెలికిన ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ ఎటువంటి చిత్రవిచిత్రమైన వ్యక్తో.. ఆయన వేసే ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది. సామాన్య జనానికి ఏ మాత్రం అర్థం కాని విధంగా బేతాళుని చిక్కుప్రశ్నల్లా అనిపించే వాటిలో నిగూఢంగా ఓ సెటైర్ దాగి ఉంటుంది. అదే ఆర్జీవీ స్టైల్. ఆయన ఎప్పుడు ట్వీట్ చేసినా అదొక వార్త అవుతుంది. అది డోనాల్డ్ ట్రంప్ అయినా నరేంద్రమోడీ అయినా కేసీఆర్ అయినా మెగా హీరోలైనా.. ఎవ్వరైనా సరే వర్మ ట్వీట్ స్టైల్ మాత్రం మారదు. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో నెటిజన్లకు అర్థం కావడం లేదు. ఓ సారి ఆ సంగతేంటో చూద్దాం.

మెగా బ్రిల్లియన్స్..

వావ్ నువ్ ఎప్పటికీ గొప్ప తెలివగల వాడివి.. నీ విశ్లేషణా సామర్థ్యం ముందు ఐన్ స్టీన్ కూడా మూగబోయేవాడు.. నీ బుద్దికి, మెగా బ్రిలియన్స్‌కు గులామ్ అంటూ ఓ ట్వీటేశాడు. అయితే ఇందులో మెగా అనే పదం వాడటంతో ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన ట్వీట్ అయి ఉంటుందని మెజార్టీ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

నాగబాబును ఉద్దేశించా?

నాగబాబును ఉద్దేశించా?

అయితే ఈ ట్వీట్‌ కంటే మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్స్‌ను గమనిస్తే ఎంతో కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మద్యం షాపులు ఓపెన్ చేయడంపై నాగబాబు వరుస ట్వీట్స్ చేశాడు. ఇంతకాలం మద్యం కావాలి మొర్రో అంటూ వర్మ ట్వీట్ల వర్షం కురిపించేవాడు. అయితే నాగబాబు మద్యం షాపులు ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకించడంపై వర్మ ఇలా సెటైరికల్‌గా స్పందించి ఉండొచ్చు.

మద్యం షాపులు తెరవడంపై..

మద్యం షాపులు తెరవడంపై..

ఇంతకీ నాగబాబు ట్వీట్ల సారాంశం ఏంటంటే.. ఇంత వరకు చేసిన ప్రయత్నం అంతా వృథా అవుతుంది.. మద్యం షాపులు ఓపెన్ చేయకండని కేంద్రాన్ని విన్నపం చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇంత అర్జంట్‌గా వైన్స్ షాప్స్ ఓపెన్ చేసి ఉండకూడదు.. ఇది పెద్ద తప్పులా అనిపిస్తోంది. జనం మందు విషయంలో విచక్షణ కోల్పోతోన్నారని పేర్కొన్నాడు.

లిక్కర్ అమ్మకాల రికార్డులు..

లిక్కర్ అమ్మకాల రికార్డులు..

వరుణ వాహిని బిగ్గెస్ట్ హిట్.. దేశవ్యాప్తంగా అదిరిపోయే టాక్ వచ్చింది. బాహుబలి, టైటానికి కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టేలా ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు.. యూపీలో వంద కోట్లు, ఏపిలో 68 కోట్లు, కర్ణాటకలో 45 కోట్లు అంటూ ట్వీట్ చేశాడు.

Recommended Video

Watch : Ram Charan Learning To Make Butter With His Grandmother
 కన్ఫ్యూజన్‌లో నెటిజన్స్..

కన్ఫ్యూజన్‌లో నెటిజన్స్..

ఇక వర్మ చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో తెలీక కొందరు తలలు పట్టుకుంటే.. మరికొందరు పవన్ కళ్యాణ్‌ను అయి ఉంటుందని, ఇంకొందరు విజయ్ దేవరకొండ, డోనాల్డ్ ట్రంప్ అని చెప్పగా.. మెజార్టీ నెటిజన్స్ నాగబాబు అంటూ కామెంట్స్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్స్‌ను జత చేసి వీటికే ఆర్జీవీ కౌంటర్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X