బాలకృష్ణ సినిమాల మీదా వర్మ ఈ సుమోల సెటైర్!?
రామ్ గోపాల్ వర్మ క్యాజువల్ గా మాట్లాడినా ఏదో వివాదం తొంగి చూస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన ఫ్యాక్షన్ సినిమాల్లో సుమోలు పేల్చడం మీద కామెంట్ చేసారు. ఆయన మాటల్లోనే...రక్తచరిత్రలో నరసింహారెడ్డిని నరికే సన్నివేశంలో రవి కళ్లలో కనపడాల్సింది పగ అంతే. వేరే ఏదీ అవసరం లేదు. హంగులు కోసం అక్కడ సుమోలు పేల్చామనుకోండి. అప్పుడు బడ్జెట్ తడిసి మోపెడవుతుంది అన్నారు. అలాగే ఒక సినిమా తెరకెక్కించడానికి ఎక్కువ రోజులు పట్టేది తెలుగు పరిశ్రమలోనే. తెలుగు సినిమా పరిశ్రమ మూసధోరణికి అలవాటు పడిపోయింది అన్నారు. ఇక సుమోలు పేల్చడం,గాల్లోకి లేవటం వంటివన్నీ బాలకృష్ణ యాక్షన్ సినిమాలతోనే మొదలయ్యాయి. కాబట్టి ఆయన..ఆ చిత్రాలని ఉద్దేశించి అన్నారా లేక ఈ తరహా సినిమాలన్నిటినీ కలపి చెప్పుకొచ్చారా అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఆయన తాజా చిత్రం అప్పలరాజు కోసం విడుదల చేసిన ట్రైలర్ లోనూ బాలకృష్ణ తొడ కొట్టే సీన్ ని గమ్మత్తుగా,నవ్వు వచ్చేలా చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన రక్త చరిత్ర పార్ట్ 2...డిసెంబర్ మూడవ తేదిన విడుదల అవుతోంది. ఈ పార్ట్ లో తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో కనపడతారు.


Click it and Unblock the Notifications











