జీవితంలో ఒకే ఒక్క తప్పు... బాలయ్యపై వర్మ వదిలిన వీడియో వైరల్
ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టిట్టర్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయంది. 'ఎన్టీఆర్ బయోపిక్' తీసి బాలయ్య తప్పు చేశారు అనే అర్థం వచ్చేలా ఈ వీడియో ఉండటం గమనార్హం.
'నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు.. ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయడం' అంటూ ఈ వీడియోలో బాలయ్య మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే వాయిస్ మాత్రం వేరొకరితో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
త్వరలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రచారానికి దేన్నీ వదలడం లేదు. ఆసక్తికర ట్విట్టర్ పోస్టులతో సినిమాపై అంచనాలు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అవ్వడానికి ముందే ముగించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత రామారావు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? కుటుంబంలో, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని ఇందులో స్పష్టంగా చూపించబోతున్నారు ఆర్జీవీ.


Click it and Unblock the Notifications











