»   » ఆమె బాయ్‌ఫ్రెండు కంటే అనుష్క శర్మ బెటర్ అంటూ ట్వీట్

ఆమె బాయ్‌ఫ్రెండు కంటే అనుష్క శర్మ బెటర్ అంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండిమా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో క్రికెట్ ద్వేషి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో తన దైన పదునైన ట్వీట్లతో రెచ్చి పోయాడు. విరాట్ కోహ్లి విఫలం అవ్వడానికి అనుష్క శర్మే కారణమని ఓ వైపు క్రికెట్ అభిమానులంతా ఆమెపై అబాండాలు వేస్తుంటే...వర్మ మాత్రం అనుష్క శర్మను వెనకేసుకొచ్చాడు.

‘నేను వ్యక్తిగతంగా అనుష్క శర్మను పెర్ఫార్మెన్స్‌ను చాలా చాలా ఇష్టపడతాను. ఆమె బాయ్ ఫ్రెండ్ పెర్ఫార్మెన్స్ కంటే అనుష్క శర్మ పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అంటూ ట్వీట్ చేసాడు. అంతే కాదు టీమిడియా ఓడి పోవడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపించాడు వర్మ.

ఓ వైపు భారత క్రికెట్ అభిమానులంతా బాధలో ఉంటే...... నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీటాడు. దేశానికి ‘క్రికెటైటిస్' అనే వ్యాధి పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మందు, సిగరెట్ వల్ల నష్టం వ్యక్తుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ క్రికెట్ వల్ల దేశానికి నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్స్ క్రింది విధంగా ఉన్నాయి.

టీమిండియా ఓడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను క్రికెట్ ను ద్వేషిస్తాను. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే క్రికెట్‌ను ద్వేషిస్తున్నాను. క్రికెట్ వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతోంది. చాలా మంది క్రికెట్ మ్యాచ్ సమయంలో పని చేయకుండా టీవీలు చూస్తూ ఉండి పోతున్నారు అని వర్మ ట్వీట్ చేసారు.

RGV says Anushka Sharma is better than Virat

‘క్రికెటైటిస్' అనే ప్రమాదకరమైన వ్యాధి నుండి ఈ దేశ పౌరులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియాను మళ్లీ మళ్లీ ఓడించాలని ఇతర దేశాల జట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశ పౌరులు క్రికెట్ చూడటం ఆపేసి, చక్కగా పని చేసుకునే ఆలోచన వచ్చే వరకు ఇలానే పదే పదే ఓడించాలని కోరుకుంటున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.

ఆల్కహాల్, సిగర్ రెట్ లాంటి వాటికి బానిస అయితే....ఆ నష్టం వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ దేశం క్రికెట్ కు బానిస అవుతే అది జాతీయ వ్యాధి అవుతుంది. ద్వేషించే వాళ్లను నేనే ప్రేమిస్తాను..ఎందుకంటే ద్వేషం ప్రేమకంటే స్పైసీగా ఉంటుంది అని వర్మ ట్వీట్ చేసాడు.

English summary
“I personally like Anushka Sharma's performance much much More than the performance of whoever and whatever her boyfriend is”, said Ram Gopal Varma.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu