సెక్స్ కన్నా మహేష్ బాబే బెస్ట్ అంటున్నాడు
బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు, పూరీ డైలాగులు, డైరక్షన్ సెక్స్ కన్నా చాలా బెస్ట్ అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేసారు. అలాగే బిజినెస్ మ్యాన్ లో డైలాగులుని తీసుకుని దాన్ని మార్చి ఆయన ట్వీట్ చేసిన విధానం కూడా చాలా మందికి నచ్చుతోంది. అదేమిటంటే.. ఎక్కువ సినిమాలతో బిజెనెస్ మ్యాన్ ని రౌండప్ చేస్తే కన్ఫూజన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బ్రద్దలు కొట్టేస్తుంది అంటూ ట్విట్టర్ లో రాయటం చాలా మంది మహేష్ అభిమానులును ఆకట్టుకుంది. రీసెంట్ గా పూరీ ఈ చిత్రానికి సంభందించిన రషెష్ ని రామ్ గోపాల్ వర్మకు చూపించటం జరిగిందని, అది చూసిన వర్మ ఇలా ఉత్సాహంతో ట్వీట్ చేసారని చెప్తున్నారు. అలా ఈ చిత్రానకి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ.. పూరీ చిత్రం నేనూ నా రాక్షసి కోసం కూడా ఇలాగే రోజుకో ట్వీట్ చేసి సినిమాని హైప్ చేసే ప్రయత్నం చేసారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అ తర్వాత చిరంజీవి, పూరీ కాంబినేషన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. అయితే ఆ సినిమా అస్సలు మెటీరియలైజ్ కాలేదు.. కాదని తేలిపోయింది. ఆ తర్వాత మహేష్ తో పూరీ దర్శకత్వంలో ఖైధీ చిత్రం రీమేక్ అని ట్వీట్ చేసి సంచలనం క్రియేట్ చేసారు. అయితే అదీ ఫేక్ అనీ, అస్సలు అలాంటి ఆలోచన మహేష్ కు అస్సలు లేదని తేలిపోయింది. ఇవన్నీ చూసిన మహేష్ అభిమానలు రామ్ గోపాల్ వర్మ నుంచి ట్వీట్ వస్తోందంటే సందేహంలో పడటంలో ఆశ్చర్యం లేదు.


Click it and Unblock the Notifications











