ఇటు కన్నీరు, అటు పన్నీరు... నాగబాబు నన్ను మించిపోయారంటున్న ఆర్జీవీ!
Recommended Video

బాలయ్యను టార్గెట్ చేస్తూ నాగబాబు వరస వీడియోలు విడుదల చేస్తున్న నేపథ్యంలో.... ఈ గొడవలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేలు పెట్టాడు. నాగబాబు కామెంట్లలో నన్ను మించిపోయారంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
''నాగబాబు రిలీజ్ చేసిన వీడియోలు చూశాను. ఆయన కామెంట్లలో నన్ను మించిపోయారనే ఈర్ష్య, బాధ మొదలైంది. అదే సమయంలో తన స్టార్ బ్రదర్స్‌ను డిఫెండ్ చేయడంలో సూపర్ స్టార్ అయ్యారనే ఆనందం కూడా నాలో కలిగింది'' అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

ఇటు కన్నీరు, అటు పన్నీరు
నాగబాబు ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు కార్చుతూ అద్భుతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు హాట్పాఫ్ చెప్పాలనిపిస్తోందన్న ఆర్జీవీ... మీరు మీ అన్నదమ్ములను ప్రేమిస్తున్నదానికంటే ఎక్కువగా నేను వారిని ప్రేమిస్తున్నానని ట్వీట్ చేశారు.
వారు తనను అలా చూస్తున్నా....
మెగాబ్రదర్ నాగబాబుతో పాటు మెగా ఫ్యామిలీ తనను.... చెడ్డవాడిగా చూస్తున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మ వారిపై ప్రేమను ప్రదర్శిస్తున్నట్లు చెబుతుండటం గమనార్హం. ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకుని పబ్లిసిటీ తెచ్చుకోవడం రామ్ గోపాల్ వర్మకు మాత్రమే చెల్లిందని చెప్పక తప్పదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోని వివాదస్పద అంశాలు, వెన్నుపోటు ఉదంతం ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? అనేది ఇప్పటికీ వర్మ వెల్లడించక పోవడం గమనార్హం.
ఎందుకు? సాంగ్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నటించేది ఎవరు? రిలీజ్ డేట్ ఎప్పుడు? అనే విషయాన్ని ఇంకా ప్రకటించక పోయినా.... సినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని ‘వెన్నుపోటు' సాంగ్ విడుదల చేయగా నేడు(జనవరి 8) సాయంత్రం 5 గంటలకు ‘ఎందుకు?' అనే మరో పాట రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











