చంద్రబాబులా ఉండే వ్యక్తి వర్మకు దొరికాడు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎలా వాడతాడో?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలిన వ్యక్తి వీడియో ఒకటి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అచ్చం చంద్రబాబు ముఖకవలికలతో ఉన్న సదరు వ్యక్తి తెల్లగడ్డంతో సహా జిరాక్స్ కాపీలా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఈ వ్యక్తిపై టాప్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ దృష్టి పడింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తున్న ఈ కాంట్రవర్సల్ డైరెక్టర్ అచ్చం చంద్రబాబులా ఉన్న ఇతగాడిని తన సినిమాలో వాడేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి ఆచూకి తెలిపిన వారికి రూ. 1 లక్ష రివార్డ్ సైతం ప్రకటించారు.
హోటల్‌లో సర్వర్‌గా
సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న వీడియోలో చంద్రబాబు పోలికలతో ఉన్న వ్యక్తి హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కన్ను అతడిపై పడిన నేపథ్యంలో అతడి జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

ఎక్కడ దొరికాడో?
ఎక్కడ దొరికాడో తెలియదు కానీ.... వర్మ ఇతగాడి ఆచూకి ఎట్టకేలకు కనుక్కున్నాడు. రోహిత్ అనే వ్యక్తి ద్వారా అతడి సమాచారం అందుకున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా బృందానికి చంద్రబాబును బహుమతిగా అందించినందుకు థాంక్స్ చెప్పాడు.

అకౌంట్‌లో రూ. లక్ష.... టైటిల్ క్రెడిట్ కూడా
ముందుగా ప్రకటించినట్లు రోహిత్‌కు రూ. లక్ష ఇవ్వనున్నట్లు వర్మ ప్రకటించాడు. దాంతో పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రారంభంలో అతడికి థాంక్స్ కార్డు కూడా వేయనున్నట్లు వర్మ స్పష్టం చేశారు.

డూప్లికేట్ బాబును ఎలా వాడతాడో?
దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా ఆయన భార్య లక్ష్మి పార్వతి కోణంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఈ డూప్లికేట్ బాబును వర్మ ఎలా వాడబోతున్నాడు? అనేది హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











